Allu Sirish Okka Kshanam to be sued over Copy Marks | సేమ్ టూ సేమ్.. కాపీ కాదంటే ఎలా?

Okka kshanam copy mark issue

Okka Kshanam, Allu Sirish, Parallel Life Movie, 2 Memiddaram, Anil Sunkara, Legal Trouble, Okka Kshanam Release Trouble

Troubles For Allu Sirish's Okka Kshanam. Okka Kshanam in the midst of plagiarism row. Mega hero Allu Sirish is gearing up for the release of his new film Okka Kshanam. The film is said to be based on Parallel Life concept and the movie is said to have inspired by a Korean film.

ఒక్క క్షణం.. కాపీ వివాదం ముదురుతోందా?

Posted: 12/18/2017 07:17 PM IST
Okka kshanam copy mark issue

అల్లు శిరీష్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ 'ఒక్క క్షణం' సినిమా చేశాడు. విభిన్నమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గతంలో వచ్చిన కొరియన్ సినిమా 'ప్యారలల్ లైఫ్'ను స్ఫూర్తిగా తీసుకుని చేశారనే ప్రచారం జరుగుతోంది.

'ప్యారలల్ లైఫ్' రీమేక్ హక్కులను తీసుకున్న నిర్మాత అనిల్ సుంకర, '2 మేమిద్దరం' సినిమాను నిర్మిస్తున్నాడు. 'ఒక్క క్షణం' అదే కాన్సెప్ట్ తో వస్తుండటంతో, ఆయన ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్టుగా గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ స్పందిస్తూ .. కొరియన్ సినిమా 'ప్యారలల్ లైఫ్' తాను చూశానని, కంటెంట్ పరంగా ఆ సినిమాకి .. తమ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తమ సినిమా విడుదలైన తరువాత ఈ విషయం తెలుస్తుందని స్పష్టం చేశాడు. అయితే ఈ విషయంపై అనిల్ సుంక‌ర ‘ఒక్క క్ష‌ణం’ బృందాన్ని నిల‌దీశాడన్న టాక్ వినిపిస్తోంది.

చర్చలు విఫలం కావటంతో ఒక్క క్ష‌ణం’ నిర్మాత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు పంపించ‌డానికి రంగం సిద్ధం చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ లోపు చర్చలు సఫలం కాకపోతే ‘ఒక్క క్ష‌ణం’ వచ్చే వారం విడుద‌ల అవ్వ‌డం క‌ష్ట‌మే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles