Vijay Devarakonda Rejects Bollywood Big Offer | బాలీవుడ్ లో బంపరాఫర్.. యశ్ చోప్రా బ్యానర్ లో... ఎందుకు రిజెక్ట్ చేశాడు?

Vijay devarakonda bollywood movies

Vijay Devarakonda, Yash Chopra Banner, Vijay Devarakonda Bollywood Movies, Bollywood Yash Chopra, Yash Chopra Banner Agreements

Vijay Devarakonda reject bollywood offer. Yash Chopra banner plans three back to back movies with Vijay. But, Vijay not interested in those.

బాలీవుడ్ ఆఫర్ కి విజయ్ దేవరకొండ నో

Posted: 12/18/2017 05:33 PM IST
Vijay devarakonda bollywood movies

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తొలి హిట్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, 'పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతే ఆయనకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

తెలుగులో ఆయన ఓకే చేసిన ప్రాజెక్టులే అరడజనుకు పైగా వున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్, కోలీవుడ్ ల నుంచి ఆఫర్లు వచ్చినపడుతున్నాయి. బాలీవుడ్లో భారీ సంస్థగా చెప్పుకునే యష్ రాజ్ ఫిలిమ్స్ వారు, విజయ్ దేవరకొండతో వరుసగా 3 సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ ఆఫర్ ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్టుగా సమాచారం.

యశ్ రాజ్ సంస్థ ఎవరైనా సరే డెబ్యూలో వారితో వరుసగా సినిమాలు చేయాలనే ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇంతకు ముందు అనుష్క శర్మ, రణ్ వీర్ సింగ్ విషయాల్లో కూడా ఇలాంటిదే జరిగింది. దీంతో విజయ్ డీల్ ఓకే అంటే.. ఆ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయడానికి ఉండదు. అందువలన ఈ డీల్ విషయంలో విజయ్ దేవరకొండ ఆసక్తిని చూపించలేదని తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles