Mohanlal’s massive transformation for Odiyan Teaser | ఒడియన్ టీజర్.. కంప్లీట్ యాక్టర్ భయంకరమైన మార్పు

Mohanlal odiyan teaser review

Mohanlal, Odiyan Teaser, Mohanlal Odiyan Movie, Odiyan Movie Teaser

Mohanlal’s massive transformation to play Manickan is impressive in Odiyan teaser. Mohanlal’s physical transformation for his role in the upcoming fantasy thriller will stun you. Mohanlal reportedly lost 18 kgs in 51 days.

ఒడియన్ టీజర్.. మోహన్ లాల్ మ్యాజిక్..

Posted: 12/15/2017 07:23 PM IST
Mohanlal odiyan teaser review

మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడతారు అనేది తాజాగా నటించిన ఒడియన్ సినిమా అద్దం పడుతుంది. తాజాగా ఒడియన్ చిత్రం కోసం ఆయన పడ్డ కష్టం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 51 రోజుల్లో 18 కేజీలు తగ్గి ఆయన ఔరా అనిపించారు. ఈ చిత్ర టీజర్ ఇటీవలె విడుదల కాగా పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇందులో మోహన్ లాల్ మాణిక్కన్ ఒడియన్ గా కనిపించనున్నారు. ఒడియన్ అనేది ఓ కల్పిత జీవి. సగం మనిషి.. సగం జంతువు రూపంలో ఉండి అతీంద్రియ శక్తులున్న మనుషులు అడవుల్లో రాత్రివేళ సంచరించేవారన్నది కేరళలోని మలబార్ ప్రాంత ప్రజల నమ్మకం. కేరళ జానపదాల్లో ఒడియన్ల పేరు బాగా వినిపిస్తుంది. అలాంటి ఓ వ్యక్తి జీవిత కాలంలో జరిగిన సంఘటనలతో ఒడియన్ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

నైట్ ఎఫెక్ట్ లో ఉన్న ఫొటో ప్రేమ్ లోకి ఉన్నట్టుండి మోహన్ లాల్ వచ్చి గంభీరంగా డైలాగులు చెప్పి వెళ్లిపోతారు. రొటీన్ గా ఉండే టీజర్ల కు డిఫరెంట్ గా సాగుతుంది. చివర్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా అనిపిస్తుంది. మళయాళ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెతో తెరకెక్కుతున్న చిత్రం ఒడియన్. వి.ఎ. శ్రీకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మంజు వారియర్.. ప్రకాష్ రాజ్ కూడా ఇందులో నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles