Samantha loved to live in Savitri Time | సావిత్రి కాలంలో ఉండటం అదృష్టం : సమంత

Samantha post mahanati set photo

Samantha Ruth Prabhu, Mahanati Movie, Mahanati Movie Sets, Samantha Mahanati Sets, Samantha Instagram

Samantha Ruth Prabhu Posted Mahanati Movie Set Photo. I would have loved to live in her time . So glad I get a piece of it now in Instagram.

సమంతకు ఈ ఇల్లంటే ఎంతో అభిమానం అంట!

Posted: 12/15/2017 06:39 PM IST
Samantha post mahanati set photo

అక్కినేని ఇంటి పేరుగా మారిపోయాక సమంత ఇప్పుడు డీ గ్లామర్ రోల్స్ కు పరిమితం కానుందన్న విషయం ప్రస్తుతం ఆమె చిత్రాల పోస్టర్లను బట్టి అర్థమైపోతోంది. రామ్ చరణ్ రంగస్థలంతోపాటు కోలీవుడ్ లో విశాల్, విజయ్ సేతుపతి చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.

అన్నింటిలో కూడా పద్ధతైన పాత్రల్లో ఆమె కనిపించబోతోంది. రంగస్థలం విషయంలో అది మరీ మరీ దారుణంగా ఉంది. ఇక మహానటిలో మాత్రం ఆమెది చాలా ప్రత్యేకమైన పాత్రేనని మేకర్లు, ఆమె గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. జమున రోల్ అని చెప్పినప్పటికీ.. ఇప్పుడు ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో అది నిజం కాదేమోనన్న సంకేతాలను అందిస్తోంది.

విశ్వానాథన్ శాస్త్రి అని నేమ్ ప్లేట్ ఉన్న ఇంటి గురించి ప్రస్తావిస్తూ 80వ దశకంలో అందులో ఉండటం తనకు ఎంతో సంతోషానిస్తుందని ఆమె తెలిపింది. ఈ లెక్కన్న ఆ పేరుతో తెలుగు, తమిళ్ సినిమాకు సంబంధం ఉన్న వారు ఎవరూ లేకపోవటం.. అన్నింటికన్నా జమునా క్యారెక్టర్ కు ఈ ఇంటితో సంబంధం లేదన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటే సమంత పాత్ర ఇప్పుడు మరింత సస్పెన్స్ గా మారింది. అది తేలాలంటే మార్చి 29 దాకా ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles