Nani MCA Movie Censor Details Out | ఎంసీఏ చిత్ర సెన్సార్ రిపోర్ట్.. రెగ్యులర్ కథ కానీ...

Nani mca censor completed

Hero Nani, Sai Pallav, MCA Movie, Middle Class Abbayi, MCA Censor Report, MCA Censor Complete, Nani MCA Movie, Nani MCA Movie Censor Details

Tollywood actor Nani and Sai Pallavi starring MCA (Middle-Class Abbayi) has been completed censor formalities, and it gets “U/A” certificate without any cuts. The film is all set for a grand release worldwide on 21st of this month.

నాని ఎంసీఏ సెన్సార్ పూర్తి.. యూ/ఏ సర్టిఫికెట్

Posted: 12/15/2017 04:11 PM IST
Nani mca censor completed

ఎట్టకేలకు నాని ఎంసీఏ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. కొంత కాలంగా నాని వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాదిలో ఆయన చేసిన 'నేను లోకల్' .. 'నిన్నుకోరి' సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఈ ఏడాది ఆయన నుంచి వస్తోన్న 3వ సినిమానే 'మిడిల్ క్లాస్ అబ్బాయి'.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ అకా మిడిల్ క్లాస్ అబ్బాయ్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని .. క్రేజీ బ్యూటీ సాయిపల్లవి నటించారు. భూమిక, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక సినిమా రెగ్యులర్ కథే అయినా నాని, సాయి పల్లవి, భూమిక నటన.. కొన్ని కామెడీ డైలాగులు.. ఎంటర్ టైనింగ్ సాగిపోయే కథనం సినిమాకు ఆకర్షణగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్కడా ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా U/A సర్టిటిఫికేట్ ను సంపాదించుకుంది. ఫైట్ల మూలంగా చిత్రానికి ఇది దక్కినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles