Narayanamurthy Interesting Comments on Chiru | దాసరి బుక్ లాంఛ్ లో చిరుపై తమ్మారెడ్డి, నారాయణమూర్తి కామెంట్లు...

Tera venuka dasari interesting incidents

Tera Venuka Dasari Book, Mega Star Chiranjeevi, R Narayana Murthy, Tammareddy Bharadwaj, R Narayanamurthy Allu Aravind, Mohanbabu Family

Chiranjeevi Launches Tera Venuka Dasari a book written by senior journalist Pasupuleti Rama Rao. Besides Manchu Family absent Tammareddy Bharadwaj and R Narayanamurthy Comments on Chiru.

తెర వెనుక దాసరి ఈవెంట్ లో ఆసక్తికర ఘటనలు

Posted: 12/13/2017 03:43 PM IST
Tera venuka dasari interesting incidents

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును ఖ్యాతిని తెచ్చుకున్న దర్శకులు నిర్మాత దాసరి నారాయణ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మరణించినప్పుడు సినిమా పరిశ్రమ ఎంతగా బాధపడిందో అందరికి తెలిసిందే. ఎంతో మంది కళాకారులను సినిమా ఇండస్ట్రీకి తీసుకురావడమే కాకుండా చిన్న సినిమాలకు ప్రత్యేకంగా సపోర్ట్ చేయాలనీ నిరంతరం కృషి చేస్తుండేవారు. ఆయన జీవితంపై సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు రచించిన ‘తెరవెనుక దాసరి’ పుస్తకావిష్కరణలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు,టి.సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్, రచయిత పసుపులేటి, ఆర్ నారాయణ మూర్తి, దాసరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

(ఫోటోల కోసం క్లిక్ చేయండి)

ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర ఘటనలు..

చిరుకు తమ్మారెడ్డి విజ్నప్తి...

దాసరి మరణం తర్వాత ఎవరికి వారు బిజీ అయిపోయి సినిమా పరిశ్రమలో కొన్ని మంచి కార్యక్రమాలను మరచిపోతున్నారు. దీంతో ఆ బాధ్యతలను ఎవరైనా తీసుకుంటే బావుంటుందని చాలా మంది సినీ ప్రముఖులులో చాలా సార్లు చెప్పారు. చర్చలు కూడా బాగానే సాగాయి. దీనిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని చెప్పారు. దాసరి బాధ్యతలను మెగాస్టార్ అయిన చిరంజీవిగారు తీసుకుంటే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

''చిరంజీవి ఒక మెగాస్టార్. దాసరి తరువాత ఆయనే ఆ రేంజులో ఉన్నారు. కాబ్టటి అదే స్థాయిలో ఆయన సినిమా ఇండస్ర్టీ విషయాలను నెత్తిమీద వేసుకుని చూసుకుంటే బాగుంటుంది. ఆయన చూసుకుంటారనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనలోమనకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా.. దాసరి కూడా వాటిని పక్కనపెట్టి ఇండస్ర్టీ కోసం నుంచున్నారు. మరి చిరంజీవిగారు కూడా అలాగే నుంచోవాలి'' అంటూ తమ్మారెడ్డి వెల్లడించారు. చూద్దాం మరి ఫ్యూచర్లో ఈ విషయంలో చిరంజీవి ఏం చేస్తారో.

చిరుకు అసలు ఏముందని?

మీరు 150 సినిమాలు తీశారు.. ముసలోడు అయ్యాక నేనెంత గొప్ప సినిమా చేశాను అని చెప్పుకోవటానికి ఏదైనా సినిమా ఉందా? అని సీనియర్ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎన్టీఆర్ చెప్పుకోవటానికి ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయని.. ఏఎన్నార్ కు చెప్పుకోవటానికి గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. కృష్ణకు అల్లూరి సీతారామారాజు ఉంది. అందరికి ఉన్నాయి. కానీ గ్రేట్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పుకోవటానికి సినిమా లేదు. ఆయన ముసలోడు అయితే అరే.. నేనెంత గొప్ప సినిమా చేశాను అని చెప్పుకోవటానికి ఏ సినిమా లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.

కానీ.. ఇప్పుడు మాత్రం సైరా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ ఉంది" అని వ్యాఖ్యానించారు. దీంతో సభ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆవేశంతో తనపై నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలకు చిరు సన్నగా నవ్వుతూ.. థ్యాంక్యూ అంటూ బదులిచ్చారు. మరోవైపు నిర్మాత అల్లు అరవింద్ ను విలన్ లాగా ప్రొజెక్టు చేయటానికి కొందరు యత్నిస్తుంటారని.. కానీ, ఆయన చాలా మంచి వ్యక్తి అని.. చిరు-అరవింద్ లు కృష్ణార్జునులు అని ఆయన పేర్కొన్నారు.


100 రూపాయలు వద్దన్నారు...

తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం గురించి చిరు ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాకు అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్న సమయమది. అప్పుడు పసుపులేటి గారు నాపై ఓ వ్యాసం రాశారు. అందుకు బహుమతిగా నా జేబులో ఉన్న వంద రూపాయిల్ని ఆయనకు ఇవ్వబోయా. కరెంటు షాక్ తగిలినట్లుగా పసుపులేటి వెనక్కి వెళ్లారు. ఎందుకంటే అప్పట్లో వంద రూపాయలంటే చాలా ఎక్కువ. నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. అయినా ధైర్యం చేసి ఆయనపై గౌరవంతో దాన్ని ఇచ్చా. కానీ, వృత్తి జీవితం పట్ల కమిట్ మెంట్ ఉన్న ఆయన తాను ఓ పాత్రికేయుడని.. అలాంటి నజరానాలు తనకు వద్దని చెప్పారు అంటూ భావోద్వేగంగా చిరు ప్రసంగించాడు.

అన్నింటికి మించి... 

ఇక ఈ ఈవెంట్ లో అన్నింటికి మించి ఓ విషయంపైనే బాగా చర్చ జరిగింది. దాసరి ప్రియ శిష్యుడు, ఆయన్ని మరో తండ్రిలా భావించే మోహన్ బాబుగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవటం విశేషం. వారికి ఆహ్వానం అందలేదా? లేక అందినా రాలేదా? అన్న విషయంపై స్పష్టత కొరవడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles