Victory Venkatesh Birthday Special Story | వెంకీ బర్త్ డే స్టోరీ.. మిగతా వారితో పోలిస్తే సమ్ థింగ్ స్పెషల్

Victory venkatesh birthday special

Daggubati Venkatesh, Venky Birthday Special, hbdvenkatesh, Venkatesh Birthday Special, Happy Birthday Venkatesh, Venkatesh Cine Carrier Highlights

Tollywood Senior Hero, Daggubati Venkeatesh Birthday Special. Victory Hero set new trend among star heroes.

విక్టరీ వెంకీ పుట్టిన రోజు ప్రత్యేకం

Posted: 12/13/2017 01:16 PM IST
Victory venkatesh birthday special

వైవిద్యభరితమైన సినిమాలు, కెరీర్ లో ఎక్కువ రీమేక్ లు, తక్కువ సినిమాలు ఇది సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేరు మీదున్న మార్క్. వయసు పైబడుతున్నా యంగ్ హీరోలకు ఇప్పటికీ పోటీ ఇస్తున్నాడంటే అందుకు కారణం వెంకీ ఎంచుకుంటున్న డిఫరెంట్ కథలే . విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఈ అగ్రహీరో పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి...

- 1960 డిసెంబర్ 13జన్మించిన వెంకి 1986లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వర్ రావు హీరోగా తండ్రి రామానాయుడు నిర్మించిన ప్రేమ్ నగర్ లో తొలిసారిగా నటించాడు.

- కలియుగపాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్.
  అప్పటి నుంచి నుంచివెంకీ వెనక్కి చూడకుండా ఎన్నో సూపర్ హిట్స్ తో దూసుకుపోయారు. ఆయన నటించిన ఎక్కువ సినిమాలు ఫ్యామిలీని ఆకట్టుకున్నాయి. ప్రస్తుత హీరోల్లో బెస్ట్ యాక్టర్ గా        ఐదు నంది అవార్డులు అందుకున్న ఘనత కూడా ఆయనకే దక్కింది. ప్రేమ, ధర్మచక్రం, గణేష్, కలిసుందాం..రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” సినిమాలకు గాను వెంకీ ఉత్తమ నటుడిగా          అవార్డులు వరించాయి.

-  ఫ్యామిలీ సినిమాలే కాకుండా.. శత్రువు, బొబ్బిలిరాజా, క్షణం క్షణం ఘర్షణ లాంటి యాక్షన్.. ప్రేమ, ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా, ప్రేమతో.. రా లాంటి లవ్ స్టోరీలతో     తిరుగులేని               విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే మరీ ఊర మాస్ ప్రయోగాలు చేసిన టైంలో మాత్రం అవి బెడిసి కొట్టాయి.

- లో బడ్జెట్ చిత్రాలతో (ఈనాడు, దృశ్యం, గురు) బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత ఆయనది. అగ్ర హీరో అయినప్పటికీ ఆయన కెరీర్ లో ఇప్పటిదాకా బిగ్ బడ్జెట్ చిత్రాలు లేకపోవటం గమనార్హం.

- తెలుగు ఇండస్ట్రీకి దూరమైన మల్టీ స్టారర్ ట్రెండ్ ను దశాబ్దాల తర్వాత ఆద్యం పోసిన వాడిగా వెంకీ గుర్తింపు పొందారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాల గోపాల లాంటి మల్టీస్టారర్ లో    ఆయన నటించి మిగతా వారు ముందుకొచ్చేందుకు ప్రేరణగా నిలిచారు.

- ఫ్యామిలీ విషయానికొస్తే మూవీ మొఘల్ రామానాయుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకీ..1985 డిసెంబర్ 13న నీరజను వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు,          కొడుకు. ఆయన సోదరుడు సురేష్ తండ్రి నుంచి నిర్మాణ సంస్థను వారసత్వంగా స్వీకరించి ముందుకు సాగుతున్నారు. పలు హిట్ చిత్రాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించటం              తెలిసిందే. సురేష్ బాబు తనయుడు రానా హీరోగా ఇప్పుడు రాణిస్తున్నాడు. త్వరలో బాబాయ్-అబ్బాయి మల్టీస్టారర్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో “ఆట నాదే వేట నాదే” ఆనే సినిమాలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్.. పవన్ అజ్నాతవాసిలో కూడా ఆయన ఓ కీలక పాత్ర పోషించబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన తర్వాతి చిత్రాన్ని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారు కూడా. వివాదరహితుడు, ఇండస్ట్రీలో అజాత శత్రువు, డౌన్ టూ ఎర్త్, ఆధ్యాత్మిక ధోరణి, అదే సమయంలో మోడ్రన్ సిద్ధాంతాలను సైతం పాటించే వెంకీకి తెలుగువిశేష్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles