Kamal Haasan okays to Shruti marriage | శృతీ, కమల్.. ఓ బాయ్ ఫ్రెండ్

Green signal for shruthi haasan marriage

Kamal Haasan, Shruti Haasan, Michael Corsale, Kamal Haasan Michael Corsale, Shruti Haasan Marriage, Shruti Haasan Boy Firend

Kamal Haasan blessings for Shruti Haasan wedding marriage with boy friend Michael Corsale. The past few months rumors have been flying left right and center about Shruti Haasan going strong with British actor Michael Corsale

శ్రుతిహాసన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్

Posted: 12/06/2017 05:15 PM IST
Green signal for shruthi haasan marriage

స్టార్ డాటర్ గా అడుగుపెట్టి తక్కువ కాలంలోనే తనకంటూ హీరోయిన్ గా ఓ గుర్తింపు పొందింది శృతీహాసన్. చాలా ఓపెన్ మనస్తత్వం ఉన్న శృతీ వైవాహిక జీవితం గురించి కూడా ఆ మధ్య తన మనసులోని కోరికను చెప్పేసింది.

పెళ్లికి ముందే డేటింగ్ చేస్తానని.. అవసరమైతే పిల్లలను కన్న తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పటం చూశాం. కమల్ కూడా తన తనయ నిర్ణయానికి గౌరవం ఇస్తానని ప్రకటించటం చూశాం. అయితే యూకే బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సాలే తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న శృతీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్న వార్తలు ఆ మధ్య జోరుగా షికారు చేయగా.. వాటిని ఆమె ఖండించారు. ఇక ఇప్పుడు మరోసారి వారి పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో తల్లి సారికతో శృతీ, కోర్సలే చక్కర్లు కొట్టడం చూశాం. ఇప్పుడు ఏకంగా తండ్రి కమల్ తో ఈ జంట దర్శనమిచ్చారు. ఆదవ్ కన్నడసన్-వినోదిని వివాహ వేడుక కార్యక్రమానికి ఈ ఇద్దరూ హాజరయ్యారు. కమల్ తోపాటు వీరు ముచ్చటించుకుంటున్న ఫోటోలు జోరుగా వైరల్ అవుతుండటంతో వీరి వివాహానికి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles