Kollywood Director Demands Vishal Resignation | విశాల్ మూలంగా కోలీవుడ్ మొత్తం కష్టాల పాలవుతుంది!

Director cheran fire on vishal

Director Cheran, Hero Vishal, RK Nagar By Election, Vishal Cheran, Vishal Producer Council President

Director Cheran wants Vishal to quit producers council "Majority of the film producers support the demand," Cheran said when asked how many members of the council are supporting Vishal's ouster. Vishal Contesting RK Nagar by Poll and filed Nomination Yesterday.

విశాల్ పై ఫైర్ అయిన దర్శకుడు చేరన్

Posted: 12/05/2017 12:30 PM IST
Director cheran fire on vishal

నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీ మరో మలుపు తీసుకుంది. తమిళ దర్శకుడు, నటుడు చేరన్(ఆటోగ్రాఫ్ ఫేమ్) విశాల్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాడు. నిర్మాతల మండలి అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకుని, విశాల్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఆరోపించాడు. ఈ మేరకు ఆయన నిర్మాతల మండలికి ఓ లేఖ రాశాడు.

గతంలో నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్‌... ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేయడంలో వున్న ఆంతర్యం ఏంటని చేరన్ ప్రశ్నించారు. విశాల్ చర్యలతో నిర్మాతల సంఘం తీవ్రంగా నష్టపోతుందని.. నిర్మాతలు నడిరోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. విశాల్ పై వ్యతిరేకతతో భవిష్యత్తులో ప్రభుత్వ సహకారం లభింకపోగా.. చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నాడు.

అలాగే ఇప్పటిదాకా నడిగర్ సంఘానికి గానీ, నిర్మాతల మండలికి విశాల్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. విశాల్ నిజంగా నిర్మాతల మండలి శ్రేయస్సు కోరితే తక్షణం తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్కేనగర్ లో విశాల్ వ్యతిరేక పోరాటం మొదలు పెడతామని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles