Niharika Impressed with Kollywood Teaser | నిహారిక కోలీవుడ్ టీజర్ ఊపేస్తోంది...

Niharika konidela kollywood teaser

Oru Nalla Naal Paathu Solren, Niharika Konidela, Oru Nalla Naal Paathu Solren Teaser, Oru Nalla Naal Paathu Solren Teaser Review, Vijay Sethupathi

Oru Nalla Naal Paathu Solren Teaser Review. Niharika Mesmerize with Two Different Shades.

నిహారిక కొణిదెల కోలీవుడ్ టీజర్ దూసుకెళ్తోంది

Posted: 11/30/2017 09:44 AM IST
Niharika konidela kollywood teaser

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన నిహారిక కొణిదెల తొలి సినిమా 'ఒక మనసు'తో మంచి పేరుతెచ్చుకుంది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించినంత సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. ‘ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్'(ఒక మంచి రోజు చూసి చెబుతా) సినిమాలో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రను ఆమె దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

టీజర్ విడుదల కాగా, ఇప్పటికే దీనిని 7 లక్షలకు పైగా అభిమానులు వీక్షించారు. విజయ్ సేతుపతి ఇందులో ఓ వైవిధ్యభరమైన పాత్ర చేస్తుండటం విశేషం. సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా, జస్టిన్ ప్రభాకర్ తదితరులు నటించారు. ఓవైపు మోడ్రన్ అవతారంతోపాటు.. ఇలా ట్రడిషనల్ లుక్కులో కూడా ఆమె కనిపించబోతుంది.

ఆర్ముగ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహారిక నటిస్తోంది కాబట్టి ఈ చిత్రం తెలుగులోనూ రిలీజయ్యే అవకాశముంది. ఇది కాక సుమంత్ అశ్విన్ తో కలిసి నిహారిక తెలుగులో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles