KTR happy to be in Nanis company నాని మ్యాటర్ లో చాలా డెప్త్ వుందండోయ్.!

Nani too feels the same with ktr company

nani, ktr, telangana it minister, natural star, geetam university, special moment, company, role model, students, tollywood

Natural Star Nani has a special moment when the Telangana Minister says that he is happy to be in the star's good company. And Nani in Reply says he too feels the same.

నాని కూడా మంత్రిలా ఎందుకు ఫీలవుతున్నాడు

Posted: 11/27/2017 04:11 PM IST
Nani too feels the same with ktr company

నేచురల్‌ స్టార్ నాని తన సహజమైన నటనతో యువతకు అభిమాన హీరోగా రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారని అనడంలో సందేహం లేదు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా రాజకీయాలలో కొత్త ఒరవడితో ముందుకెళ్తూ..  ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ.. వెంటనే సాయం అందేలా చర్యలు తీసుకుంటూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. నాని.. సహజ నటనలో నేటితరానికి వరమని, మేటి నటుడని కూడా కేటీఆర్ ఇటీవల కామెంట్లు చేశారు.

కాగా విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో మై రోల్ మోడల్ అంశంపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఓ విద్యార్థి.. మంత్రి కేటీఆర్, నటుడు నానిని ఆదర్శంగా తీసుకుని ప్రజెంటేషన్ ఇచ్చాడు. వీరిద్దరి గురించి వివరిస్తూ ప్రొజెక్టర్ పై కేటీఆర్, నాని ఫోటోలను ప్రదర్శించాడు. ఈ ప్రజెంటేషన్ ఫోటోను హేమంత అనే నెటిజన్ ట్విట్టర్ లో పోస్టు చేసి కేటీఆర్ కు ట్విట్టర్ లో ట్యాగ్ చేశాడు.

ఈ ఫోటోపై మినిస్టర్ కేటీఆర్ స్పందించారు.. వావ్! ఇది ఎక్కడ జరిగిందో కానీ.. నాకు చాలా నచ్చింది. పక్కనే నాని కూడా మంచి కంపెనీ ఇచ్చారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే అదే ఫోటోపై నాని కూడా ట్విట్ చేస్తూ ‘నేనూ అదే ఫీలవుతున్నా బ్రదర్.. ఈ ఫోటో చూడగానే నా ముఖంలో చిరునవ్వులు పూశాయి. థాంక్యూ అని నాని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles