మెగా-మంచు ఫ్యామిలీల మధ్య కొంత కాలం క్రితం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. పైకి నవ్వుతూ మాట్లాడుతూనే సెటైర్లు వేసుకోవటం ఆయా హీరోలకు అలవాటే. వజ్రోత్సవాలు వేదికగా.. చిరు-మోహన్ బాబు స్పీచ్ లు మంటపుట్టించగా... పద్మభూషణ్ సన్మాన కార్యక్రమంలో పవన్ స్పీచ్ తో అది మరింతగా ముదిరింది.
కానీ, కొంత కాలంగా ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనోజ్ పెళ్లిలో పవన్ కళ్యాణ్ సందడి.. అదే సమయంలో చెర్రీ-ఉపాసన దంపతులతో మంచు లక్ష్మీ ఔటింగ్.. అల్లు అర్జున్ తో కూడా మనోజ్ స్నేహం మెయింటెన్ చేయటం ఇలా స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తూ వస్తోంది. ఈ దశలో మొన్నీ మధ్యే రామ్ చరణ్ పై మంచు మనోజ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. "నా సోదరుడు రామ్ చరణ్ 'రంగస్థలం' పాటలు వినిపించినప్పటి నుంచి... అవి నన్ను వెంటాడుతున్నాయి. ఆడియో - సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. వెంటనే విడుదల చేయండి" అంటూ మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
తాజాగా మరో మెగా హీరోపై మంచు మనోజ్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఇవాళ సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం జవాన్ ట్రైలర్ విడుదల అయ్యింది. అది చూసిన రంజిత్ సింగ్ అనే ఓ ఫ్యాన్.. తేజూను చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తున్నారంటూ ట్వీట్ చేశాడు. దీనికి అనూహ్యంగా మంచు మనోజ్ రిప్లై ఇచ్చాడు. "అఫ్ కోర్స్ మా వాడిది వాళ్ల మేనమామ పోలిక. ఎక్కడికి పోతుంది... అంటూ మనోజ్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Ofcourse Maa vadidhi valla Mena Mama Polika yekadiki pothundhi ?:) ... https://t.co/qHY8zhHX8P
— Manoj Kumar Manchu(@HeroManoj1) November 23, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more