Bunny’s Next With Hat trick Star Director | రామ్ చరణ్, ఎన్టీఆర్ బిజీ.. బన్నీతో కొరటాల మూవీ ఖరారు!

Bunny replaces ntr project

Allu Arjun, Allu Arjun Koratala Siva movie, Allu Arjun New Movie, NTR Ram Charan Bunny, Koratala Movie Bunny

Allu Arjun’s Next under Koratala Siva Direction. NTR will be busy with Trivikram , Ram Charan packed with Boyapati Srinu and then there is Rajamouli waiting for Tarak-Cherry to recreate new history in Tollywood. So now Allu Arjun has came into picture for Koratala Siva to direct a hard core mass entertainer an Dil Raju expressed to produce the movie, said sources.

ఎన్టీఆర్ ఎగ్జిట్.. బన్నీతో కొరటాల ఫిక్స్

Posted: 11/23/2017 06:00 PM IST
Bunny replaces ntr project

హ్యాట్రిక్ దరశకుడు కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తోనే ఓ చిత్రం ఉండబోతుందని ఆ మధ్య ప్రకటించినా.. ఆ ప్రాజెక్టుపై ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు రామ్ చరణ్ తో ఎప్పటి నుంచో ఓ మంచి చిత్రం అందించాలనుకుంటున్న కొరటాల కథ మూలంగానే అది కుదర్లేదని చెబుతున్నాడు.

ఈ నేపథ్యంలో నాగ్ తన తనయుడు అఖిల్ తో ఓ చిత్రం చేయాలంటూ కొరటాలను రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు కూడా అందాయి. అయితే ఇవేవీ కాదని.. కొరటాల ఓ స్టార్ హీరోతో సినిమాను కమిట్ అవబోతున్నాడని సమాచారం. టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో  సినిమా సెట్ అయ్యిందన్న సంకేతాలు అందుతున్నాయి.  ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత.. బోయపాటితో సినిమా చేస్తాడు. ఆ తర్వాత చెర్రీ-తారక్ కాంబోలో రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో బన్నీయే కొరటాలకు ఆప్షన్ కాబోతున్నాడన్న మాట.

వీరిద్దరి కాంబోను సెట్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు నిర్మాతగా ముందుకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే సినిమా సినిమాకు సమీకరణాలు మారిపోతున్న తరుణంలో వీరి చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగటమే మంచిది. ఫ్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా షూటింగ్ లో ప్రస్తుతం బన్నీ బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles