Nag Much Exited on New Movie Launch Event | వర్మ చిత్రంలో నాగ్ ఫస్ట్ డైలాగ్ ఏంటో ఓసారి చూడండి

Nag new movie launch details

Nagarjuna Akkineni, Ram Gopal Varma, NagRGV4, RGV Comapany, NagRGV, Nagarjuna Varma Movie Launch, Nag Dialogue, Annapurna Studios

Nagarjuna Akkineni Ram Gopal Varma New Movie Launched. Nag Excited on project and first dialogue viral on social media.

నాగ్-వర్మ మూవీ లాంఛ్ వివరాలు

Posted: 11/20/2017 04:08 PM IST
Nag new movie launch details

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున అక్కినేని, క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబోలో కొత్త చిత్రం నేడు అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 28 ఏళ్ల క్రితం ఎక్కడైతే శివ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యిందో.. ఇప్పుడు అదే ప్లేస్ లో వర్మ కొత్త చిత్రం ప్రారంభించారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో చిత్రం ఇది.

అన్నపూర్ణ స్టూడియోలో వర్మ తల్లి ముహుర్తం షాట్ ను ప్రారంభించారు. 28 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుందని నాన్న చెప్పేవారు. ఇప్పుడు డబుల్ మెచ్యూరిటీతో కొత్త చిత్రం ప్రారంభించా అని నాగ్ ఈ సందర్భగా వ్యాఖ్యానించారు. తాను నాగార్జునను ఎక్కువగా నమ్ముతానని, కథ విన్న తరువాత నాగ్ రియాక్షన్ చూసిన తరువాత ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం పెరిగిందని అన్నాడు. "గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తరువాత తెలుస్తుంది" అన్నారు.

అయితే "నాకు మాత్రం మైండ్ దొబ్బలేదు... బాగానే ఉంది" అంటూ కౌంటరిచ్చాడు నాగ్. ఈ చిత్రం తనకు చాలా ఎక్సయిట్ మెంట్ ను కలిగిస్తోందని, రెగ్యులర్ షూటింగ్ కు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఉందని చెప్పాడు. ఇక ఫస్ట్ షాట్ డైలాగ్ ఏంటంటే... నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా.. చెప్పకపోయినా నేను నిన్ను చంపటం గ్యారెంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్. తక్కువ నొప్పితో చస్తావా? ఎక్కువ నొప్పితో చస్తావా?... ఈ డైలాగ్ ద్వారా వర్మ మరోసారి ఏదో మ్యాజిక చేయబోతున్నాడన్న నమ్మకం మాత్రం అక్కినేని ఫ్యానన్స్ లో కలిగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles