Jyothika's Cuss Dialogue stirs controversy | అర్జున్ రెడ్డి మాదిరిగానే.. జ్యోతిక నోటి నుంచి బూతు.. వివాదం

Bad word from actress jyothika

Naachiyar, Actress Jyothika, Naachiyar Teaser, Naachiyar Controversy, Director Bala, GV Prakash, Naachiyar Jyothika Bad Word

The teaser of the Tamil movie 'Naachiyar', starring Jyothika and GV Prakash, is in the news for a controversial reason. Jyothika Using a Cuss Word in teaser.

జ్యోతిక డైలాగ్ పై దుమారం

Posted: 11/17/2017 08:36 AM IST
Bad word from actress jyothika

నటి, సూర్య భార్య జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో నాచియర్ అనే చిత్రంలో ఆమె నటించింది. డైరెక్టర్ బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్ర టీజర్ ఈ మధ్యే విడుదల కాగా.. ఇందులో జ్యోతిక నోటి నుంచి వచ్చిన ఓ డైలాగ్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ఈ చిత్రంలో ఆమె ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోంది. టీజర్ లో భాగంగా ఆమెతో యాక్షన్ సీన్లు చూపించిన దర్శకుడు చివర్లో ఆమె నోటి నుంచి ఓ డైలాగ్ కూడా చెప్పించాడు. అది దాదాపు అర్జున్ రెడ్డి ‘ఎం’ పదం లాంటిదే. మ్యూట్ లేకుండా విడుదల చేసిన ఈ డైలాగుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే బాలా చిత్రంలో ఇలాంటివి సాధారణమే అయినప్పటికీ మరీ జ్యోతిక నుంచి వచ్చేసరికి ఇలా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ చిక్కులు తప్పవేమో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles