Padmavati Release Karni Sena calls for bandh | మరింత ముదిరిన పద్మావతి వివాదం.. ఏకంగా భారత్ బంద్ కు పిలుపు

Karni sena calls for bandh on padmavati release day

Padmavati Release, Shri Rajput Karni Sena, Sanjay Leela Bhansali, Padmavati Bharat Bandh, Padmavati Controversy, Padmavati Issue, Padmavati Sanjay Leela Bhansali, Padmavati Issue Khan Heroes,

The Shri Rajput Karni Sena called for a ‘Bharat Bandh’ (shutdown) on December 1 if Sanjay Leela Bhansali’s movie Padmavati releases on that date, while the Maharashtra government provided a precautionary security cover for the filmmaker in view of the increasing controversies and growing threats.

ముదిరిన పద్మావతి వివాదం.. భారత్ బంద్ కు పిలుపు

Posted: 11/16/2017 08:43 AM IST
Karni sena calls for bandh on padmavati release day

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' చిత్రం విడుదల దగ్గర పడుతున్నా కొద్దీ మరింత మంట పుట్టిస్తోంది. ఈ సినిమా విడుదలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని రాజ్ పుత్ కర్ణిసేన స్పష్టం చేసింది. ఈ చిత్రం విడుదలను నిరసిస్తూ రాజ్ పుత్ కర్ణి సేన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

రాజ్ పుత్ కర్ణి సేన నేత లోకేంద్ర సింగ్ కల్వి మాట్లాడుతూ, సినిమా విడుదలకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ ఉదయం బెంగళూరులో ఈ సేనకు చెందిన సభ్యులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ, సినిమా విడుదలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.

మరోపక్క సినిమా స్క్రీనింగ్ కు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ సిద్ధంగా ఉన్నప్పటికీ తమకూ చిత్రాన్ని చూపించాలన్నదే రాజ్ పుత్ సేన ప్రధాన డిమాండ్ గా వినిపిస్తోంది. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఇది వరకే బాలీవుడ్ చిత్ర దర్శకులు, నిర్మాతలు విజ్ణప్తి చేశారు. కాగా, ఈ చిత్రానికి బాలీవుడ్ ఖాన్ త్రయం ఇంతవరకు స్పందించకపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles