Savyasachi Regular Shoot starts in Hyderabad | సవ్యసాచి కాన్సెప్ట్ మాత్రమే కాదు. టేకింగ్ కూడా డిఫరెంటేనంట!

Savyasachi regular shoot

Naga Chaitanya, Savyasachi, Chandoo Mondeti, Savyasachi Regular Shoot, Savyasachi Heroine, Nidhhi Agarwal, Madhavan, Madhacan Savyasachi

Naga Chaitanya's ‘Savyasachi’ Regular Shooting starts in Hyderabad from today. Chandoo Mondeti Directorial Venture in Different Concept. Interesting aspect of the film is that Tamil top actor R.Madhavan playing an important role.

సవ్యసాచి... ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా

Posted: 11/08/2017 10:07 AM IST
Savyasachi regular shoot

అక్కినేని హీరో నాగచైతన్య తండ్రి నాగ్ తరహాలో రొమాంటిక్ చిత్రాలతోనే సాగిపోతున్నాడు. కెరీర్ మొదట్లో కూడా మన్మథుడు అలాంటి కథలనే ఎంచుకోవటం తెలిసిందే. అయితే మాస్ సబ్జెక్టుల వైపు వెళ్లినప్పుడల్లా చైతూకు ఎదురు దెబ్బే పడుతోంది. దీంతో తనకు చాలా గ్యాప్ తర్వాత హిట్ ఇచ్చిన చందూ మొండేటితో సవ్యసాచి లో నటిస్తున్నాడు.

చందూ మొండేటి సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అంటూ ఒక ఫోటోను వదిలారు. పెళ్లయ్యాక గ్రాండ్ పార్టీలు ఇచ్చిన చైతూ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి నేరుగా ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా వుంటుందనే విషయాన్ని గురించి చందూ చెప్పినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. చెయ్యి కంట్రోల్ లో లేకపోవటం అనే కాన్సెప్ట్ చాలా వైవిధ్యంగా తీయబోతున్నానని చందూ ఇంట్రెస్టింగ్ పాయింట్ ను గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం టేకింగ్ కూడా చాలా వైవిధ్యంగా ఉంబోతుందని చెబుతున్నాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' ఘన విజయాన్ని సాధించడం వలన, ఈ కాంబినేషన్ పై అంచనాలు వున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి, మైత్రీ మూవీస్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. తమిళ నటుడు మాధవన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. వచ్చే ఏడాది ద్వితియార్థంలో చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles