Balakrishnudu Movie Release Date Announced | కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇద్దరికీ హిట్ అవసరమే!

Nara rohit movie release details

Balakrishnudu Movie, Balakrishnudu Release Date, Balakrishnudu Nara Rohit, Balakrishnudu Nara Rohit, Nara Rohit Regina Need a Hit, Nara Rohit Movie Release Date

Balakrishnudu’ starring Nara Rohith and Regina to release on November 24th. This Faction Drama actress Regina will be seen in a non-glamourous avatar in the film.

బాలకృష్ణుడు రిలీజ్ డేట్ ఫిక్స్

Posted: 11/02/2017 03:36 PM IST
Nara rohit movie release details

వైవిధ్యభరితమైన కథలు, వరుస సినిమాలు ప్రస్తుతం నారా రోహిత్ చేస్తున్న పని ఇదే. అయితే గత కొంత కాలంగా సక్సెస్ రేటు మాత్రం ఈ నారా హీరోకి తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అప్పట్లో ఒకడుండేవాడు తర్వాత వచ్చిన 'శమంతకమణి' ఫరవాలేదనిపించుకున్నా.. హిట్ మాత్రం కాలేకపోయింది.

దీంతో తన తర్వాతి చిత్రం 'బాలకృష్ణుడు'తో ఎలాగైనా హిట్ అందుకోవాలని అతను ఊవ్విళ్లూరుతున్నాడు. పవన్ మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించింది. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించింది. హైదరాబాద్ - కర్నూల్ చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ ప్రేమకథగా ఈ సినిమా కొనసాగుతుంది. ఈ నెల 10న ఆడియో విడుదల చేసి.. ఈ నెల 24వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఇంత కాలం బొద్దుగా ఉన్న నారా రోహిత్.. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లో కనిపించబోతుండటం విశేషం. కెరీర్ పరంగా రోహిత్ కు, రెజీనాకు ఈ చిత్రం హిట్ కావటం చాలా అవసరం. మరి అన్ సీజన్ లో వచ్చి సక్సెస్ చవిచూస్తారా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles