Ileana Wedding Rumour clarified with Tweet | ట్వీట్ తో సీక్రెట్ పెళ్లి నిజమని చెప్పిందా?

Ileana secret marriage rumour

Ileana D'Cruz, Ileana D'Cruz Secret Marriage, Ileana D'Cruz Wedding, Ileana D'Cruz Tweet, Ileana D'Cruz Marriage Tweet, Ileana D'Cruz Rumour

Actress Ileana D'Cruz Secret marriage Reveal. Recently Ileana tweet about that.

ఇలియానా సీక్రెట్ పెళ్లి.. ఏది నిజం?

Posted: 10/25/2017 02:55 PM IST
Ileana secret marriage rumour

టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎగిరిపోయిన నటి ఇలియానా వార్తల్లో నిలవటం మాత్రం మానలేదు. ఆ మధ్య హాట్ హాట్ ఫోటోలు, డబుల్ మీనింగ్ డైలాగులతో కోటేషన్లు పెట్టిన బెల్లీ బ్యూటీ కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. పైగా మీడియా కంట పడకుండా తిరుగుతోంది కూడా. దీంతో ఇలియానాకు పెళ్లందంటూ అక్కడి మీడియా కథనాలు రాస్తోంది.

ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో అనుబంధం కొనసాగిస్తున్న ఇలియానా.. ఆ విషయాన్ని చాలా ఓపెన్ గానే చాలా సార్లు చెప్పేసింది. పైగా పెళ్లిచేసుకున్నామా? లేదా? అన్నది ముఖ్యం కాదని పలు సందర్భాల్లో ఇలియానా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా మొత్తం ఆమె సీక్రెట్ వెడ్డింగ్ పని తేల్చే పనిలో బిజీగా మునకలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఆమె పెళ్లి వార్తను నిజమని ఖరారు చేసేలా ఉందని తెలుస్తోంది.

‘మిమ్మల్ని నవ్వించే, ప్రేమించే స్నేహితులను వెతుక్కోండి’ అని చెబుతూ ఒక ఫొటోను పోస్టు చేసింది. ఆ ఫొటో క్రెడిట్ తన బెటర్ హాఫ్ కి చెందుతుందని పేర్కొంటూ ఆండ్రూ నీబోన్ కు ఇచ్చింది. దీంతో ఇది వైరల్ గా మారింది. సాధారణంగా బెటర్ హాఫ్ అనే పదాన్ని భార్యాభర్తలు మాత్రమే వాడుతారు. ప్రేమికులు, స్నేహితులు వాడరు. మరి ఆ లెక్కన్న వారి పెళ్లి అయిపోయినట్లేనంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles