Dinchak Pooja Get Set Fire in Bigg Boss | బిగ్ బాస్ జోకులు.. సల్మాన్ కు ఢించక్ పూజ వార్నింగ్ వీడియో

Dinchak pooja message to salman

Dhinchak Pooja, Bigg Boss 11, Dhinchak Pooja Wild Card Entry, Bigg Boss 11 Wild Card Entry, Dhinchak Pooja Set Fire Bigg Boss Show, Dhinchak Pooja Salman Khan

Dhinchak Pooja said about her 'much awaited' wildcard entry in Bigg Boss 11. Salman Khan Get Ready for set fire.

సల్మాన్ కు ఢించక్ పూజ మెసేజ్

Posted: 10/21/2017 03:39 PM IST
Dinchak pooja message to salman

ఇప్పటికే వివాదాలతో హిందీ బిగ్ బాస్ సీజన్ వార్తల్లో నిలుస్తుండగా.. ఇప్పుడు దీనికి కొత్తగా మరో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి పడింది. తన కర్ణకఠోర వాయిస్ తో జనాలను పిచ్చెక్కిస్తున్న డింఛక్ పూజ బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టబోతుంది. అంతే సోషల్ మీడియాలో దీనిపై రక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

`యూట్యూబ్‌లోనే నిన్ను త‌ట్టుకోలేకపోతున్నాం తల్లీ, ఇంకా ప్ర‌తిరోజు నిన్ను బిగ్‌బాస్‌లో కూడా చూడాలా?` అంటూ ఒకరు.. తన పిచ్చి గొంతుతో హౌజ్ మేట్లకు పిచ్చెక్కించటం ఖాయమంటూ మరోకరు.. ఇక సల్మాన్ షోకి రాకుండా ఇంట్లో ఉంటే మంచిదని... ఇలా ఏకీ పడేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె బిగ్‌బాస్ కోసం చేసిన ఆడిష‌న్ టేప్ ఒక‌టి నెట్లో వైర‌ల్‌గా మారింది. బిగ్‌బాస్‌ను మండించ‌డానికి వ‌స్తున్నా... సిద్ధంగా ఉండు స‌ల్మాన్ ఖాన్‌.. అని పూజ అన‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

త‌న‌కు పాజిటివ్‌గా ఉండే వాళ్లంటే ఇష్ట‌మ‌ని, బిగ్‌బాస్ ఇంట్లో కూడా త‌న ప్ర‌వ‌ర్త‌న మార‌ద‌ని పూజ ఈ వీడియోలో అంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌కి సంబంధించిన ఆమె ర్యాప్ చేయ‌డం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇదిలా ఉండ‌గా గత రాత్రి ఢించ‌క్ పూజ ఓ కొత్త పాట విడుద‌ల చేసింది. `ఆఫ్రీన్ ఫాతిమా బెవ‌ఫా హై` అనే పాట‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 15 గంట‌ల్లోనే దాదాపు 75 వేల మంది వీక్షించారు.త‌న సూప‌ర్ హిట్ ఆల్బమ్స్ అయిన `సెల్ఫీ మైనే లేలే ఆజ్‌`, `దిల్లోంకా స్కూట‌ర్` కంటే ఇది మరింత దారుణంగా ఉండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles