Geetha Madhuri Reaction about Usha's Imitation Episode | తన గొంతును ఇమిటేట్ చేయటంపై సింగర్ స్పందన

Usha imitation geetha madhuri reaction

Singer Geetha Madhuri, Singer sha, Usha Imitate Geetha Madhuri, Singer Usha Controversies, Singer Usha Geetha Madhuri Controversy, Geetha Madhuri Interview

Geetha madhuri Responded Over Usha's Imitation Episode. In a Event Usha imitate Geetha Madhuri.

ఉష ఇమిటేషన్ పై గీతా మాధురి స్పందన

Posted: 10/14/2017 03:27 PM IST
Usha imitation geetha madhuri reaction

హస్కీ వాయిస్ తో ఆకట్టుకునే సింగర్స్ గీతామాధురికి ప్రత్యేకమైన స్థానం వుంది. ఆమె వాయిస్ లోని వైవిధ్యాన్ని ఇష్టపడే అభిమానులు ఎంతోమంది వున్నారు. అలాంటి గీతామాధురిని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సింగర్ ఉష సరదాగా ఇమిటేట్ చేసింది. ఆ విషయాన్ని గురించి ఐ డ్రీమ్స్ ప్రశ్నించగా, గీతామాధురి తనదైన శైలిలో స్పందించింది.

ఉష తనను ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూను తాను చూశానని చెప్పింది. తనని ఆమె ఇమిటేట్ చేసినందుకు చాలా గొప్పగా ఫీలయ్యానని అంది. ఎవరిని పడితే వాళ్లని ఎవరూ ఇమిటేట్ చేయాలనుకోరు. అవతలివారికి ఒక ప్రత్యేకత వున్నప్పుడే అలా ఇమిటేట్ చేస్తూ తమ టాలెంట్ ను చూపుతుంటారు. అందువలన అది తనస్థాయిని పెంచినట్టుగానే భావిస్తూ గొప్పగా ఫీలయ్యానని అంది. నిజానికి తనని ఉష చాలా బాగా ఇమిటేట్ చేసిందనీ, తాను సరదాగా తీసుకుని నవ్వుకున్నానని చెప్పుకొచ్చింది.

గతంలో ఉష సింగర్ సునీతతో విభేధాలు బయటపడగా.. వాటిని సునీత కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తామిద్దరం బయట కలుసుకున్నప్పటికీ బాగానే మాట్లాడుకుంటామని ఆమె చెప్పటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles