Big B in tears after watch this emotional Video | ఆ వీడియో చూసి ఎమోషనల్ అయి ఏడ్చేసిన బిగ్ బీ

Amithbh get into tears for this video

Amitabh Bachchan, 75th Birthday, Big B Birthday Surprise Gift, Nainital Sherwood College,

Amitabh Bachchan moved to tears after emotional birthday tribute on KBC set.Team KBC released a special video which showed students and teachers of the Sherwood College, Nainital, from where Big B graduated, celebrating his birthday.

కేబీసీలో ఏడ్చేసిన అమితాబ్

Posted: 10/10/2017 03:24 PM IST
Amithbh get into tears for this video

బాలీవుడ్ దిగ్గజ న‌టుడు అమితాబ్‌ బచ్చన్‌ రేపు అంటే అక్టోబర్ 11న 75వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బావుంటుందా? అని ఆయన హార్డ్ కోర్ అభిమానులు భావిస్తుంటారు. అయితే సుమారు ఐదు దశాబ్దాలుగా అలరిస్తున్న బిగ్ బీ ఈ యేడాది పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కానీ, ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) నిర్వాహకులు మాత్రం ఊహించని బహుమతిని ఆయనకు అందించారు.

అంతే ఆయన కన్నీటిధారలో మునిగిపోయారు. అమితాబ్ బ‌చ్చ‌న్ చిన్న‌ప్పుడు చ‌దువుకున్న ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌లోని షేర్‌వుడ్‌ కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయ‌న‌కు ప్రత్యేకంగా జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షోలో అమితాబ్‌కు చూపించారు.

 

దీంతో అమితాబ్ ఉద్వేగానికి లోనై క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోలో ఉపాధ్యాయులు, విద్యార్థులు క‌ళాశాల మొత్తం అమితాబ్‌కి చెందిన పోస్టర్లను అంటించారు. ఈ వీడియోలో బిగ్ బీ ఫేవ‌రెట్‌ గిటారిస్ట్‌ నిలాద్రి కుమార్ తో బర్త్‌డే ట్యూన్‌ను వినిపించారు. ఊహించని గిఫ్ట్ తనకు అందటంతో అమితాబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో థగ్ ఆప్ హిందుస్థాన్ తోపాటు మరో అరడజను క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles