Legendary Actor Fire on Tollywood / టాలీవుడ్ కొందరి చేతుల్లో నలిగిపోతుంది : కైకాల హాట్ కామెంట్లు

Veteran actor comments on tollywood

Tollywood, Kaikala Satyanarayana, Criticism, Telugu Desam Party, NTR

Tollywood Senior Actor Kaikala Satyanarayana Fire on Telugu Industry. In past he aslo comments on Baahubali movie as worst one.

టాలీవుడ్ పై కైకాల సంచలన వ్యాఖ్యలు

Posted: 10/07/2017 03:42 PM IST
Veteran actor comments on tollywood

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాను రాను టాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోందని ఆయన పేర్కొన్నారు. ఓ సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

చిత్రపరిశ్రమ గతంలో కళ కోసం పని చేసేదని.. ఇప్పుడు మాత్రం వ్యక్తుల కోసం ఇండస్ట్రీని రన్ చేయాల్సి వస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పీక్ లో ఉండే నటుడికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉండే దని, ఇప్పుడు కోట్లలో ఉందని ఆయన చెప్పారు. కొంత మంది చేతుల్లో సినీ తల్లి చిక్కుకుపోయిందని.. ప్రస్తుతం వారే శాసిస్తున్నారని ఆయన అన్నారు. అయితే తానెవర్నీ విమర్శించాలని భావించడం లేదని, చిత్రపరిశ్రమలో ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాల గురించి మాత్రమే తాను ప్రస్తావించానని ఆయ స్పష్టం చేశారు. ఇక ఆయన తన సినీ ప్రయాణం గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.

భగవంతుడి దయవల్ల తన కెరీర్ మాత్రం సజావుగా సాగిందని దిగ్గజ నటుడు చెప్పారు. దాదాపు అన్ని రకాల పాత్రల్లో తాను నటించానని, ప్రేక్షకులు కూడా ఆదరించారని ఆయన తెలిపారు. పైగా విభిన్న రసాలను పండించడం వల్ల తనకి నవ రస నట సార్వభౌమ బిరుదు ఇచ్చారని ఆయన అంటున్నారు. పనిలో పనిగా రాజకీయాల ప్రస్థావన కూడా ఆయన తీసుకొచ్చారు. టీడీపీని స్ధాపించిన వారిలో తాను కూడా ఒకడినేనని గుర్తు చేసిన ఆయన.. ప్రస్తుతం పార్టీ తనని పట్టించుకోని పరిస్థితిలో ఉందని చెప్పారు. అయినప్పటికీ అప్పట్లో అన్న ఎన్టీఆర్ తనను సొంత తమ్ముడికంటే ఎక్కువగా ఆదరించారన్న విషయం కూడా ఆయన గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles