Raja The Great Official Trailer Released | రాజా ది గ్రేట్ ట్రైలర్.. ఇట్స్ లాఫింగ్ టైమ్

Raja the great trailer out

Ravi Teja, Raja The Great Movie, Official Trailer, Ravi Teja New Movie, ravi Teja New Trailer, Raja The Great Trailer Review

Ravi Teja's Raja The Great Movie Trailer Released.

రాజా ది గ్రేట్ ట్రైలర్ విడుదల

Posted: 10/06/2017 05:34 PM IST
Raja the great trailer out

టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ తొలిసారిగా ఓ అంధుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. ఈ సినిమా ట్రైలర్ ను కొంచెం సేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకివ్వదు... బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలుపైనా’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్, ‘నేను పూరీలు వేసుకోవడం లేదురా, ఉరేసుకుంటున్నాను!’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అనడం, ‘చివరగా వచ్చే ఆర్తనాదం వినాలని ఉంది’ అంటూ రవితేజ బదులివ్వడం ఆసక్తికరంగా ఉన్నాయి.

కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని పాటలకు సంబంధించిన సన్నివేశాలు ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ సరసన మెహ్రీన్ ఫిర్జాదా నటించింది. రవితేజ తల్లి పాత్రను నటి రాధిక పోషించారు. చివర్లో ప్రేక్షకుల ఎక్స్ ఫ్రెషన్స్ అడగటం.. లాఫింగ్ టైం అంటూ కామెడీ పాలు కూడా బాగానే ఉందని చూపించారు.

పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles