Ranveer Sigh as Khilji Trolled in Social Media | ఒక్క పోస్టర్ ను అన్ని సినిమాలతో ట్రోల్ చేస్తున్నారు

Ranveer poster trolled in social media

Ranveer Singh, Padmavati Movie, Alauddin Khijli Poster, Sanjay Leela Bhansali, Trolling

Padmavati's Ranveer Singh Poster Trolled. From Ishant Sharma to Kejriwal, Twitter sees Ranveer Singh’s Khilji in everyone. Ranveer Singh plays Sultan Alauddin Khijli in his new film Padmavati but Twitter has other ideas.

రణ్ వీర్ పోస్టర్ పై జోకులు

Posted: 10/03/2017 06:29 PM IST
Ranveer poster trolled in social media

బాలీవుడ్ లో మరో గ్రాండియర్ మూవీకి రంగం సిద్ధమౌతోంది. పద్మావతి చిత్రంతో సంజయ్ లీలా భన్సాలీ భారీగా ఫ్యాన్స్ ను ట్రీట్ ఇవ్వబోతున్నాడని అర్థమౌతోంది. ఈ క్రమంలోనే దీపిక పద్మావతి, చిత్తూరు రాజు మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ క‌పూర్‌ గెటప్ లో ఆకట్టుకున్నారు. వాటికి అదే స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక నేడు ఇప్పుడు రణ్ వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. అది తెగ ట్రోల్ అవుతోంది.

బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ వ‌స్త్ర‌ధార‌ణను హేళ‌న చేస్తూ ఇంట‌ర్నెట్‌లో ఎన్నో కామెంట్లు క‌నిపిస్తుంటాయి. ఇప్పుడు `ప‌ద్మావ‌తి` సినిమాలో అత‌ని ఖిల్జీ లుక్‌ను కూడా చాలామంది
నెటిజ‌న్లు హేళ‌న చేస్తున్నారు. ర‌ణ్‌వీర్ లుక్ హాలీవుడ్ సినిమా `జ‌స్టిస్ లీగ్`లో ఆక్వామ్యాన్ లుక్‌ని త‌ల‌పిస్తోంద‌ని, బాలీవుడ్ మ‌ళ్లీ హాలీవుడ్ నుంచి కాపీ కొట్టింద‌ని విమ‌ర్శిస్తున్నారు. అంతేకాకుండా ఆ ఫ‌స్ట్‌లుక్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ జుట్టు చూస్తే బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ గుర్తొస్తున్నాడ‌ని అంటున్నారు.

ఈ వాద‌న‌కు సాక్ష్యంగా కొన్ని ఫొటోల‌ను కూడా నెటిజ‌న్లు పోస్ట్ చేస్తున్నారు. అర‌వింద్ కేజ్రీవాల్ ఫొటోతో ర‌ణ్‌వీర్ సింగ్ లుక్‌ను పోల్చిన ఫొటో చాలా న‌వ్వు తెప్పిస్తోంది. డిసెంబర్ 1న సినిమా రిలీజ్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles