posani krishna murali in assembly అసెంబ్లీలో పోసాని.. వారితో కలసిపోయాడా..?

What actor posani krishna murali doing in assembly

Mahesh spyder, murugadoss spyder, bharath ane nenu posani, posani assembly scene, posani in assembly, posani, Bharath Ane Nenu, Mahesh Babu, koratala siva, Posani Krishna murali, Tollywood

tollywood director koratala shiva busy in shooting bharath ane nenu, even when mahesh babu is busy in promotion work of spyder

అసెంబ్లీలో పోసాని.. వారితో కలసిపోయాడా..?

Posted: 09/23/2017 12:55 PM IST
What actor posani krishna murali doing in assembly

నటుడు, ధర్శకుడు పోసాని కృష్ణ మురళి ఏకంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అదేంటి అయన అసెంబ్లీలో అడుగుపెట్టకూడదా..? అని అంటారా.. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారెవరైనా అసెంబ్లీలో అడుగుపెట్టవచ్చు. కానీ ఈయన ఎలా అంటారా.. అయినా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ఏం జరగడం లేవుగా,  అంటారా.. అయినా అయనేలా..? అక్కడికే వస్తున్నాం.

భరత్ అను నేను చిత్రంలో సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ లో భాగంగా అన్నపూర్ణ సూడియోస్ లో వేసిన అసెంబ్లీ సెట్ లో పోసాని కృష్ణమురళి ప్రజాప్రతినిధిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర హీరో ప్రిన్స్ మహేష్ బాబు వేరే పనులలో బిజగా వుండటంతో అయనకు సంబంధం లేని చిత్ర సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నారు చిత్ర దర్శకుడు కొరటాల శివ.

ప్రిన్ష్ మహేస్ బాబు తొలిసారిగా కాలీవుడ్ లో స్ట్రేయిట్ మూవీగా తరకెక్కిన చిత్రం స్పైడర్.. మరో నాలుగు రోజుల వ్యవధిలో విడుదల కానున్న నేపథ్యంతో అ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజిగా వున్నారు. అయితే అదే సమయంలో తన తదుపరి చిత్రం భారత్ అను నేను కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ధీనిని సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ కూడా ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన అసెంబ్లీ సెట్ లో చిత్రీకరణ జరుగుతుండగా అందులో పోసాని నటిస్తున్నారు.

ఈ షూటింగ్ లో పోసాని కృష్ణమురళి, సీనియర్ నటులు బెనర్జీ, జీవాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ కు సంబంధించిన ఆన్ లోకేషన్ స్టిల్ బయటకు వచ్చింది. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharath Ane Nenu  Mahesh Babu  koratala siva  Posani Krishna murali  Tollywood  

Other Articles