Raga The Great versus Raju Gari Gadhi 2 Release | రవితేజకు నాగ్ టెన్షన్.. అన్నింటా టెన్షన్.

Raviteja movie troubles with senior hero movie

Ravi Teja, Raju Gari Gadhi 2, Raja The Great, Nagarjuna, Tollywood October Movie Releases, Nag Ravi Teja Movies

Ravi Teja Raja The Great Threat with Nagarjuna Raju Gari Gadhi. Raja The Great October 13th while Raju Gari Gadhi 2 on Same Date.

రవితేజ వర్సెస్ రాజుగారి గది

Posted: 09/21/2017 05:44 PM IST
Raviteja movie troubles with senior hero movie

టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ కొత్త చిత్రం రాజా ది గ్రేట్ రిజల్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై కనిపిస్తున్న మాస్ రాజా ఎలాగైనా హిట్ కొట్టి తీరాల్సిందే. సక్సెస్ లేని హీరోల లిస్ట్ లో చేరకుండా ఉండేందుకు ఇదొక్కటే రవితేజకు ఉన్న ఛాన్స్.

అందువలన ఆయన ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ ను సాధిస్తాననే నమ్మకంతో వున్నాడు. అయితే ఆయనని 'రాజుగారి గది 2' రిలీజ్ డేట్ టెన్షన్ పెట్టేస్తోంది. నాగార్జున ప్రధానమైన పాత్రను పోషించిన 'రాజుగారి గది 2' .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. దీపావళి కానుకగా దీనిని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. దాంతో రవితేజకు టెన్షన్ పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే రవితేజ తాజా చిత్రంగా రూపొందుతోన్న 'రాజా ది గ్రేట్' అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నాగార్జున .. సమంతా వంటి స్టార్స్ ఈ సినిమాలో ఉండటం, గతంలో హిట్ కొట్టిన 'రాజుగారి గది' ప్రభావం ఈ సినిమాపై వుండటం ఆయనను కంగారు పెడుతోందని చెప్పుకుంటున్నారు. రవితేజ అంధుడిగా కనిపిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles