Star Maa New Show After Bigg Boss | బిగ్ బాస్ అయిపోతేనేం.. తర్వాత సూపర్ ఫ్లాన్ ఇదేనంట...

Star maa next plan after bigg boss

Star Maa Channel, Star Maa Another Reality Show, Star Maa Dance Show, Star Maa Dance Reality Show, Renu Desai Jani Master Adah Sharma

Star Maa Super Plan after Bigg Boss Show come to Ens. A Dance Reality show after Bigg Boss. Renu Desai Jani Master and Adah Sharma as Judges.

బిగ్ బాస్ తర్వాత డాన్స్ షోతో స్టార్ మా

Posted: 09/20/2017 12:58 PM IST
Star maa next plan after bigg boss

తెలుగులో బిగ్ బాస్ షో ముగుస్తుండటంతో స్టార్ మా ఛానెల్ టీఆర్పీ కోసం మరో అడుగు ముందుకు వేసింది. మరో కొత్త రియాల్టీ షో కోసం ఏర్పాట్లు పూర్తి చేసేసింది. హిందీలో నాచ్ బలియే తరహా కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఉంటారని సమాచారం.

ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే ఒక న్యాయ నిర్ణేతగా రేణు దేశాయ్ ను తీసుకున్నారు. అది ఈ షో కోసమేనని ఇప్పుడు స్పష్టం అవుతోంది. అయితే ఈ షోలో ఈమెతోపాటు మిగతా ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా పాల్గొనబోతున్నారంట. వాళ్లే జానీ మాస్టర్ అండ్ నటి ఆదా శర్మ. జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో అతని అనుబంధం ఇంకా ప్రత్యేకమైంది.

ఇక ఆదా శర్మ విషయానికి వస్తే, హీరోయిన్ అని మాత్రమే ఆమెను ఎంపిక చేయలేదట. కథక్ నృత్యంలోను .. వెస్ట్రన్ డాన్సుల్లోను ఆమెకి మంచి నైపుణ్యం ఉందట. ఈ కారణంగానే ఆమెను తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి ఓ ప్రోమోను వదలబోతున్నారని సమాచారం. తెలుగులో రియాల్టీ షోలకు స్టార్ నటుల పుణ్యమాని తిరిగి పునర్వైభవం వచ్చేస్తుందనే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles