Pawan 25th Movie Foreign Schedule Completed | పవన్-త్రివిక్రమ్ మూవీ మళ్లీ మొదటికేనా?

Pawan trivikram 25th movie schedule

Pawan kalyan, Trivikram Srinivas, 25 Movie, Latest Schedule, PK 25 Latest Schedule, PK 25 Hyderabad Schedule

Pawan Kalyan 25th Movie Shooting Latest Schedule Completed. Now Shooting Shifted to Hyderabad.

పవన్-త్రివిక్రమ్ మూవీ షెడ్యూల్ మళ్లీ హైదరాబాద్ లోనే...

Posted: 09/18/2017 06:08 PM IST
Pawan trivikram 25th movie schedule

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా ప్రస్తుతానికైతే 'ఇంజనీర్ బాబు', విదేశీ ప్రయాణం, పరదేశీ పయనం, 'అజ్ఞాత వాసి' ఇలాంటి అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. దసరాకు గానీ, దీపావళికి గానీ మరో సర్ ప్రైజ్ ను ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక షూటింగ్ విషయానికొస్తే... రీసెంట్ గా బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేశారు. తాజా షెడ్యూల్ ను షూటింగ్ మొదలుపెట్టిన లోకేషన్ అంటే హైదరాబాద్ స్పెషల్ సెట్లో ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించిన తరువాత యూరప్ వెళతారట. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి టైంకి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు. జనవరి10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా 25వ చిత్రం కావడంతో, పవన్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోవాలని అభిమానులు ఆశిస్తుండగా, అందుకు తగ్గట్లుగానే ప్రత్యేక హంగులతో సినిమాలను త్రివిక్రమ్ రూపొందిస్తున్నాడని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles