PM Modi writes Letters to Tollywood celebrities | మహేష్, అనుష్క, ప్రభాస్ లకు ప్రధాని రిక్వెస్ట్.. ఆయనలా స్పందిస్తారా?

Modi letters to movie celebrities through all over india

Prime Minister Narendra Modi, Modi Clean India, Tollywood Clean India, Swachhata Hi Seva Tollywood, Modi Letters Prabhas and Mahesh Babu, Mohanlal Narendra Modi, Swachhata Hi Seva Cine Celebrities, Anushka Sharma Prabhas Mahesh Babu

Narendra Modi writes to celebrities across fields to promote 'Clean India'. For Tollywood Modi Request to Prabhas, Mahesh Babu Director rajamouli and Mohan Babu. Mohanlal Joins PM Modi's Swachhata Hi Seva Initiative.

టాలీవుడ్ సినీ ప్రముఖులకు మోదీ లేఖలు

Posted: 09/18/2017 05:26 PM IST
Modi letters to movie celebrities through all over india

హీరోల కోసం కొట్టుకునే అభిమానులు వాళ్లు పిలుపునిస్తే మంచి పనులు చేస్తారన్న గ్యారెంటీ కాస్త తక్కువే. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం వాళ్లు ఖచ్ఛితంగా స్పందించి తీరతారనే నమ్మకం ఉన్నట్లుంది. అందుకే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలకు ఆయన లేఖలు రాశారు.

మ‌హాత్మా గాంధీ జ‌యంతి రానున్న నేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలు ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తెలుగు సినీ ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాశారు. వీరిలో అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితోపాటు సీనియర్ నటుడు మోహ‌న్‌ బాబు, సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు, బాహుబలి ప్ర‌భాస్ లు ఉన్నారు.

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని మోదీ అన్నారు. మ‌న ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని చెప్పారు. అలాగే మోదీ యాప్‌లో అభిప్రాయాల‌ను పంచుకోవచ్చని మోదీ సూచిస్తున్నారు. వీళ్లే కాదు బాలీవుడ్ నుంచి అనుష్క శర్మ కు, కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కు, మళయాళంలో మోహన్ లాల్ కు ఆయా రంగాల్లోని సెలబ్రిటీలకు ఆయన లేఖలు రాశారు. ఇప్పటికే మోహన్ లాల్ మోదీని పొగుడుతూ ఆ సత్కార్యంలో భాగస్వామిని అవుతానని హమీ ఇచ్చాడు. మరి మోదీ పిలుపు నేపథ్యంలో వీరి స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles