Fan Irritate Rana in Twitter Goes Viral | రానా, కాజల్ ని ఇరిటేట్ చేశాడు.. దెబ్బకు సెలబ్రిటీ అయిపోయాడు

Rana fan suicide tweet

Daggubati Rana, Kajal Agarwal, Twitter Conversation, Fan Suicide Threat

Fan Irritate Daggubati Rana in Twitter by warn suicide attempt. Later Rana Reply in Harsh way Twitters troll with that Mad Fan.

రానాకు ఫ్యాన్ బెదిరింపు.. సూసైడ్ ట్వీట్ కు రానా రిప్లై

Posted: 09/15/2017 03:36 PM IST
Rana fan suicide tweet

అభిమాన హీరో స్పంద‌న కోసం కొన్నిసార్లు పిచ్చి అభిమానంతో ఫ్యాన్స్ హ‌ద్దులు దాటుతుంటారు. అలాంటి సమయంలో ఆ వెర్రిని చూసిన నవ్వుకోవటం, తిట్టుకోవటం మినహా మనం చేసిందేం లేదు. కానీ, రీసెంట్ గా ఓ అభిమాని మాత్రం హీరో రానాకి కాస్త టెన్షన్ పెట్టాడు.

రిప్లై ఇవ్వ‌క‌పోతే సూసైడ్ చేసుకుని చ‌స్తా... సూసైడ్ నోట్‌లో మీ పేర్లు రాస్తా.. అంటూ ఓ ట్వీట్ చేశాడు. అంతే వెంటనే రానా రిప్లై ఇచ్చేశాడు. రానా, కాజ‌ల్‌ల‌కు ప్ర‌వీణ్‌ ట్విట్ట‌ర్‌లో మెసేజ్ చేశాడు. దీనికి స‌మాధానంగా `నీకు ఏమ‌న్నా పిచ్చా?` అని రానా ట్వీట్ చేశాడు. దానికి ఆ అభిమాని `జ‌స్ట్ కిడ్డింగ్ రానా, ఇలా చేయ‌క‌పోతే నువ్వు రిప్లై ఇస్తావా చెప్పు` అని అడిగాడు. అయితే మిగ‌తా నెటిజ‌న్లు ప్రవీణ్‌ని చీల్చి చెండాడారు.

తాను స‌ర‌దా కోసం చేశాన‌ని ఎంత చెప్పినా వారు వినిపించుకోకుండా విభిన్న ర‌కాలుగా చేసిన కామెంట్లు న‌వ్వుతెప్పిస్తున్నాయి. అభిమానం ముదిరితే పిచ్చి అవుతుందంటారు... ఆ పిచ్చితో వారు అభిమానించే హీరోనే బెదిరిస్తే మిగతా వాళ్లు ఊరుకుంటారా? చెప్పండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles