రోజాతో పొలిటికల్ ఫైట్ కు సీనియర్ నటి సై... త్వరలో టీడీపీలోకి | Vani Vishwanath Ready to Fight with Roja

Senior actress wants to compete on roja

Vani Viswanath, Vani Viswanath Politics, Vani Viswanath Nagari Elections, Vani Viswanath TDP, Vani Viswanath Chandra Babu Naidu, Roja about Vani Viswanath

Senior Actress Vani Viswanath to join TDP. She wants to Compete against Roja at Nagari Elections in Upcoming Elections.

రాకీయాల్లోకి వస్తా.. రోజా మీద పోటీ చేస్తా: వాణి విశ్వనాథ్

Posted: 08/29/2017 05:01 PM IST
Senior actress wants to compete on roja

సినీ గ్లామర్ రాజకీయాలకు ఇప్పుడు అదనపు ఆకర్షణగా మారుతుంది. తమ క్రేజ్ తో ఓటర్లను ఆకర్షించటంతోపాటు గెలిచాక పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఫర్ సపోజ్ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజానే తీసుకోండి. ప్రతిపక్షంలో ఆమె ఫైర్ బ్రాండ్. ఓ కీలక నేత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ప్రభుత్వంలోని నేతలను ఎవరినైనా సరే ఏకీపడేయటంలో స్పెషలిస్ట్ గా మారింది.

మరి ఆమెకు పోటీగా ప్రత్యర్థుల్లో ఎవరూ లేరా?. అవకాశం ఇస్తే ఆ పొజిషన్ లో తాను నిలుస్తానని చెబుతోంది నటి వాణివిశ్వనాథ్. తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె అంటున్నారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు చాలా ఇష్టమని... రాజకీయాల్లో ఆయన ఓ రోల్ మోడల్ అని తెలిపారు.

Vani Vishwanath versus Roja Coming Soon

అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అది కూడా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీ చేస్తానని ఆమె మనసులో మాటను బయటపెట్టారు. మరి టీడీపీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ఇద్దరు సీనియర్ హీరోయన్ల మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vani Viswanath  Politics  TDP  MLA Roja  

Other Articles