10 నెలలుగా కోమాలో వర్మ ఫ్రెండ్.. ఇంట్లోనే ఐసీయూ ఏర్పాటు | Special ICU in Director's Home For Coma Actor

Actor neeraj vora recovering from coma

Actor Neeraj Vora, Actor Neeraj Vora Coma, Neeraj Vora Health, Neeraj Vora Recover, Neeraj Vora News, Neeraj Vora Coma, Neeraj Vora Special ICU

Actor Neeraj Vora in coma for last 10 months, finally shows signs of recovery. Now He shifted from Hospital to Sajid Nadiawala's house. Phir Hera Pheri 3, has been put on hold.

కోమా నుంచి కోలుకుంటున్న సీనియర్ నటుడు

Posted: 08/29/2017 03:50 PM IST
Actor neeraj vora recovering from coma

పది నెలలుగా కోమాలో ఉన్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఎట్టకేలకు కోమా నుంచి బయటికొచ్చాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు, ఫిల్మ్ మేకర్ నీరజ వోరా క్రమంగా కోలుకుంటున్నట్లు ఆయన సన్నిహితుడు, దర్శకుడు సాజిద్ నదియావాలా వెల్లడించారు.

గత అక్టోబర్ లో తీవ్ర గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స చేయిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నెమ్మదిగా చికిత్సకు స్పందించటం మొదలుపెట్టారు. దీంతో ఆస్పత్రి నుంచి ఆయన్ని డిశ్చార్జి చేయగా, స్నేహితుడు నదియావాలా జూహులోని తన ఇంట్లోనే ఆయనను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ఓ ప్రత్యేక గదిని ఐసీయూ మాదిరిగా తయారు చేయించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన కోసం ఓ నర్స్, ఓ బాయ్, ఓ వంటమనిషి ప్రత్యేకంగా నియమించారు. వారానికొకసారి డాక్టర్లు ఆయన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మరింత త్వరగా కోలుకోవాలని సన్నిహితులు కోరుకుంటున్నారు. రంగీలా, సత్య, దావుద్, గోల్ మాల్, పిర్ హఎరా ఫెరి, కిలాడీ 420 చిత్రాల్లో నటించిన వోరా ఫిర్ హెరా ఫెరి , చాచీ 420 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వర్మ చిత్రాల్లోనే ఎక్కువ నటించిన ఆయన, వర్మకు మంచి ఫ్రెండ్ కూడా.

హెరా ఫెరీ, రంగీలా, అకేలే హమ్ అకేలే తుమ్, చోరీ చోరీ చుప్కే చుప్కే చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా వ్యవహరించాడు. భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, సంతానం లేకపోవటంతో ఒంటరిగానే ఆయన ఉంటున్నారు. ఆయన దర్శకత్వం వహించిన హెరా ఫెరీ 3 రీలీజ్ కు రెడీ అయినప్పటికీ అనారోగ్యం కారణంగా రిలీజ్ చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Neeraj Vora  Bollywood News  Coma Condition  

Other Articles