బన్నీ తర్వాతి మూవీ ఫిక్సయ్యింది | Bunny Next With Crazy Director

Allu arjun next director confirmed

Allu Arjun Bobby, Bobby Next Movie, Bunny Bobby Movie, Jai Lavakusa Director Allu Arjun

Stylish Star Allu Arjun Next Committed with Bobby. After Jai Lavakusa Bobby Signed for Allu Arjun movie.

బాబీతో బన్నీ మూవీ కన్ఫర్మ్

Posted: 08/28/2017 03:25 PM IST
Allu arjun next director confirmed

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవటంతో తర్వాతి సినిమాను చాలా జాగ్రత్తగా ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు యత్నిస్తున్నాడు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం అందుతోంది.

పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ చిత్రాల దర్శకుడు బాబీ తో తర్వాతి ప్రాజెక్టు ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి ఆయన కథ వినిపించడం .. ఆ కథ నచ్చేసి చేద్దామని అల్లు అర్జున్ చెప్పేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చేస్తున్నాడు.

అయితే వంశీ సినిమా తర్వాత ఎప్పటి నుంచో కమిట్ అయిన లింగుస్వామి సంగతి ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ బైలింగువల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికీ ఇంతవరకు ఎక్కడా ఊసు లేకపోవటంతో బహుశా బాబీ సినిమా తర్వాత ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Director Bobby  Jai Lava Kusa  

Other Articles