పెద్దనాన్న కోరుకుంది ప్రభాస్ తీర్చేస్తున్నాడు | Prabhas Next under his Uncle Banner

Prabhas movie confirm with krishnam raju

Prabhas Next movie Producer, Prabhas Next Movie, Prabhas New Movie, PrabhasKrishnam Raju Productions, GopiKrishna Movies New Movie, GopiKrishna Movies Prabhas, GopiKrishna Movies Krishnam Raju

Prabhas After Saaho Committed movie with GopiKrishna Movies Banner which owned by his Uncle, Senior Actor Krishnam Raju.

కృష్ణంరాజు బ్యానర్ లో ప్రభాస్ మూవీ కన్ఫర్మ్

Posted: 08/24/2017 11:50 AM IST
Prabhas movie confirm with krishnam raju

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో స్పష్టత లేకపోయినా ఓ లవ్ స్టోరీతో జిల్ ఫేం రాధాకృష్ణతో రాబోతున్నాడని ఆ మధ్య వార్త వినిపించింది. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో కమిట్ మెంట్ కు సిద్ధమైపోతున్నాడన్న టాక్ బయలుదేరింది.

బిల్లా తర్వాత ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని సీనియర్ నటుడు కృష్ణంరాజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే వరుస కమిట్ మెంట్లు, మధ్యలో బాహుబలి ఆ కోరికను తీర్చలేకపోయాయి. ఇప్పుడు ప్రభాస్ ఫ్రీ కావటంతో అందుకు రెడీ అయిపోతున్నారని చెబతున్నారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ లో ఓ స్టార్ దర్శకుడు దీనిని రూపొందించబోతున్నాడంట.

ఫిబ్రవరి 2018 నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని, హీరోయిన్ ఎంపిక కూడా అల్రెడీ పూర్తయిపోయిందని చెబుతున్నారు. ఓవైపు దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, లాంటి వాళ్లు ప్రభాస్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే, తన మాత్రం పెద్దనాన్నపై ఉన్న ప్రేమతో కమిట్ మెంట్ కు రెడీ అయిపోయాడు. ఇప్పటికే రాంచరణ్, అల్లు అర్జున్, లాంటి వాళ్లు సొంత బ్యానర్ లలో వరుస సినిమాలు చేస్తుండగా, ప్రభాస్ మాత్రం ఆ రేసులో కాస్త వెనుకబడే ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishnam Raju  GopiKrishna Movies  Prabhas  Saaho Movie  

Other Articles