అమీర్ సత్యమేవ జయతేను కాన్సెప్ట్ కాపీ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? | Malayalam Senior Hero Shakes TRP wth TV Show

Mohanlal small screen debut starts

Mohanlal, Mohanlal TV Show, Mohanlal Lal salam, Mohanlal New TV Show, Mohanlal TV Debut,Mohanlal Amrutha TV, Lal Salam TV Show, Mohanlal TV Debut, Mohanlal Show, Lal Salam TRP Ratings

Mohanlal begins talk show Lal Salaam, promises a socially impactful show

బుల్లితెరపై మోహన్ లాల్.. టీఆర్పీ దూసుకుపోతుంది

Posted: 08/19/2017 04:36 PM IST
Mohanlal small screen debut starts

బుల్లితెరపై ఇప్పుడు స్టార్ల హవా కొనసాగుతోంది. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే కమల్ హాసన్ కూడా బిగ్ బాస్ తో ఎంట్రీ ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో రానా, జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌లు యారి నంబర్ 1, బిగ్ బాస్ లకు వ్యాఖ్యాత‌లుగా వ్యవహరిస్తూ టీఆర్పీ రేటింగ్ను దూసుకుపోయేలా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సౌత్ లో మరో స్టార్ హీరో వంతు వచ్చేసింది.

మళయాళంలో నాలుగు ద‌శాబ్దాలుగా హీరోగా రాణిస్తూ అక్కడి ప్రజలచేత కంప్లీట్ యాక్టర్ అని ముద్దుగా పిలిపించుకునే మోహ‌న్ లాల్ కూడా బుల్లితెర రంగ‌ప్ర‌వేశం చేశాడు. `లాల్ స‌లాం` పేరుతో ఓ టాక్ షోను ఆయ‌న హోస్ట్ చేస్తున్నారు. గత రాత్రి(శుక్రవారం) ప్ర‌సార‌మైన ఈ కార్య‌క్ర‌మం మొద‌టి ఎపిసోడ్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తి శుక్ర‌, శ‌ని వారాల్లో అమృత టీవీలో ప్ర‌సారమ‌వుతోంది. అన్ని ర‌కాల టాక్ షోల మాదిరి కాకుండా ఈ షో కాన్సెప్ట్ వేరేలా ఉంది.

Mohanlal TV Show TRP

స‌మాజంలో మార్పులు తీసుకువ‌స్తున్న వ్య‌క్తుల‌ను ఈ కార్య‌క్ర‌మంలో ఇంట‌ర్వ్యూ చేస్తారు.అంటే గతంలో అమీర్ చేసిన సత్యమేవ జయతే షో లా అన్న మాట. అయితే అందులో సమస్యలపై చర్చిస్తే ఇందులో వ్యక్తుల మీద డిబెట్ జరుగుతుంది. సంఘసంస్కర్తలతోపాటు సామాజిక వేత్త‌ల‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌నున్నారు. మొద‌టి ఎపిసోడ్‌లో గాయ‌ని చిత్ర‌, మంజు వారియ‌ర్‌, టీపీ మాధ‌వ‌న్ వంటి ప్ర‌ముఖులు అతిథులుగా హాజ‌ర‌య్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohanlal  Lal Salam TV Show  Amrutha TV  

Other Articles