అదయి ఉంటే డీఎంకేలో చేరి 35 ఏళ్లు అయ్యేది | Kamal Clarify on Joining in DMK

Kamala not joining in dmk

Kamal Haasan, Kamal Haasan DMK Proposal, Kamal Haasan Murasoli, Kamal Political Entry, Kamal Really Not Interested Politics, Kamal Rajini Murasoli Event, Kamal Karunanidhi Telegram, Dravida Munnetra Kazhagam Kamal Haasan, Dravida Munnetra Kazhagam Official Magazine

Popular actor Kamal Haasan Thursday said he was getting many queries on his Twitter handle on whether Kamal Haasan would join the opposition Dravida Munnetra Kazhagam (DMK) party. "Had I was to join DMK, I would have done it in 1983," he said.The 62-year-old actor said DMK chief M. Karunanidhi had sent him a telegram during that time, asking him as to why he should not join his party. Addressing a DMK event organized to celebrate the completion of 75 years of party mouthpiece 'Murasoli', Haasan said, "I did not have the courage to either show the telegram to others or respond to it.Till this day, I have not responded to it".

రాజకీయాల్లోకి అస్సలు రాను-కమల్

Posted: 08/11/2017 08:14 AM IST
Kamala not joining in dmk

తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్లు రాజకీయ చదరంగం ఆడుతున్నారు. ఓవైపు ఆసక్తి లేదంటూనే దేవుడు శాసిస్తే తప్పక వస్తానంటూ తికమక ప్రకటనలతో అభిమానులను, రాజకీయ వర్గాలను అయోమయంలోకి నెట్టేస్తున్నారు తలైవా. ఇప్పుడు లోకనాయకుడు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడేమో అనిపిస్తుంది.

కమల్ ఈ మధ్య రాజకీయాలపై తీవ్ర స్థాయిలోనే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రావటం దాదాపు ఖాయమనే అంతా భావించారు. కానీ, చెన్నైలో జరిగిన డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ వజ్రోత్సవంలో పాల్గొన్న కమల్ చేసిన వ్యాఖ్యలు అర్థం కాకుండా ఉన్నాయి. డీఎంకేలో చేరతారనే వార్తల నేపథ్యంలో స్టాలిన్ సమక్షంలోనే తనకు అసలు సమకాలీన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి రావాలనుకుంటే 1983లోనే వచ్చేవాడినని, ఆ సమయంలో డీఎంకే అధినేత కరుణానిధి తన పార్టీకి ఓ టెలిగ్రాం ద్వారా ఆహ్వానించాడంటూ కమల్ చెప్పారు. అసలు తనకు ఆ ఉద్దేశం లేదు కాబట్టే ఇప్పటికీ దానికి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకాడని భావించిన రజనీకాంత్ కమల్ మాట్లాడుతున్నంత సేపు ఆసక్తిగా గమనించటం హైలెట్ అయ్యింది. ఏదిఏమైనా వీరిద్దరు రాజకీయరంగ ప్రవేశంపై హైడ్రామా ఇంకొన్నాళ్లు తప్పేలా కనిపించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Tamil Nadu  Politics  Dravida Munnetra Kazhagam  

Other Articles