Peepli Live actor Sitaram Panchal passes away మూడేళ్లుగా పోరాడి మృత్యువును ముద్దాడిన నటుడు

Peepli live actor sitaram panchal dies at 54 of cancer

Bollywood actor, Sitaram Panchal, sitaram panchal dead, sitaram panchal dies, sitaram panchal death, sitaram panchal news, sitaram panchal peepli live, sitaram panchal movies, sitaram panchal lung cancer, sitaram panchal aamir khan, sitaram panchal kidney, peepli live actor cancer, treatments, medical expences, financial problems, passes away, haryana government, bollywood, entertainment

Bollywood Actor Sitaram Panchal, who has featured in films like Jolly LLB 2 and Peepli Live, died after a prolonged battle with cancer.

మూడేళ్లుగా పోరాడి మృత్యువును ముద్దాడిన నటుడు

Posted: 08/10/2017 04:15 PM IST
Peepli live actor sitaram panchal dies at 54 of cancer

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సీతారాం పంచల్‌ ఇవాళ మృతి చెందారు. బాలీవుడ్ చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునే క్రమంలో అయనలో మాయదారి మహమ్మారి బయటపడింది. దానితో పోరాటం సాగిస్తూ ఇవాళ ఆయన మృత్యువును ముద్దాడి జీవితాన్ని చాలించుకున్నాడు. గత మూడు ఏళ్లుగా కెన్సర్ తో బాధపడుతున్న ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. చంబల్ లోయలలో సమాజం వెలివేయడంతో బంధిపోటు రాణిగా మారిన పూలన్ దేవి జీవిత ఇతివృతంగా 1994లో రూపొందిన చిత్రం బాండిట్ క్వీన్ తో చలనచిత్ర అరంగ్రేటం చేసిన పంచల్.. ప్రేక్షకులను తన నటనతో ముగ్దులను చేశాడు.

బాండిట్‌ క్వీన్‌ చిత్రం తరువాత ‘పీప్లి లైవ్‌’, ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘పాన్‌సింగ్‌తోమర్‌’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ-2’ తదితర చిత్రాల్లో నటించారు. అనారోగ్యం కారణంగా సినిమా అవకాశాలు లేక కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో.. వైద్యానికి కూడా డబ్బులు లేని పక్షంలో గత నెలలోనే తన అభిమానులను కూడా ఆయన సాయం చేయాలని కోరాడు. సామాజిక మాద్యమం వేదికగా తన చికిత్స కోసం అవసరమైన డబ్బు సాయం చేయాల్సిందిగా అర్థించారు.

సీతారం పంచల్ ధీన స్థితిని గుర్తించిన హరియాణ ప్రభుత్వం క్యాన్సర్ చికిత్స నిమిత్తం ఆయనకు రూ.5లక్షలు సాయం అందించింది. సినీ ఆర్టీస్ట్‌ అసోసియేషన్‌ కూడా సీతారాం వైద్యం కోసం విరాళలు సేకరించింది. సీతారామ్ కు 2014 కెన్సర్‌ వచ్చిందని, అప్పటి నుంచి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన భార్య ఉమ మీడియాకు తెలిపారు. సరిగ్గా ఆయన తన 26వ పెళ్లి రోజును జరుపుకున్న మరుసటి రోజునే మరణించారని ఇరుగుపోరుగు వారు మీడియాకు తెలిపారు. పంచల్ మరణంలో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sitaram Panchal  cancer  medical expences  passes away  bollywood  entertainment  

Other Articles