Dangal First Indian movie to Rake 1000 Crores In Overseas

Dangal beat baahubali 2 collections

Dangal Baahubali 2, Dangal beat Baahubali 2, Dangal China Collections, Dangal Rare Record, First Indian Movie 1000 Crores Overseas, Dangal Overseas Collections, Highest Indian Grosser Movie, Dangal Comapre Baahubali 2, Aamir Khan Baahubali 2 Success, Aamir Khan Rajamouli, Dangal China 1000 Crores

Dangal Beat Baahubali 2 Collections with China Strom. The Sports Drama already collected 1022 crores there. Aamir Khan Explains Why Baahubali 2 And Dangal Shouldn't Be Compared

దంగల్ నంబర్ 1 .. బాహుబలి-2 రెండో ప్లేస్

Posted: 05/26/2017 07:52 AM IST
Dangal beat baahubali 2 collections

ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ కొత్త చరిత్ర సృష్టించేసింది. మొదటగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం. ఇప్పుడు చైనాలో రికార్డుల దుమ్ము దులిపేసింది. మే 5న చైనాలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ అక్కడ రూ.1100 కోట్ల వసూళ్లను సాధించేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా 1800 కోట్లతో ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డు లోకి ఎక్కింది.

ఇక చైనాలో వెయ్యి కోట్ల వసూళ్లను ఇప్పటివరకూ ఏ హాలీవుడ్ చిత్రం కూడా సాధించలేకపోయింది. ఆ ఫీట్ ను సాధించిన తొలి విదేశీ చిత్రంగా ఆమిర్ మూవీ దంగల్ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా చైనాలో ఈ మూవీ జోరు తగ్గకపోవడం అసలు సిసలైన విశేషం. ఈ మొత్తంతో కలిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దంగల్ గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 1800 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దంగల్ సృష్టించిన అరుదైన రికార్డుతో.. 1600 కోట్ల కలెక్షన్లతో బాహుబలి2 వెనకబడిపోయింది.

అయితే.. చైనా లో బాహుబలి2 రిలీజ్ కు రెడీ అయ్యింది. కానీ దంగల్ మాదిరిగా స్పోర్ట్స్ డ్రామా కాకపోవటం, బాహుబలి పార్ట్ 1 కు ఆదరణ లభించకపోవటం, గ్రాఫిక్స్ చిత్రాలకు చైనీయులు పెద్ద పీట వేయకపోవటం ఇవన్నీ అంతరాలుగా మారే అవకాశం ఉంది.


బాహుబలి-దంగల్ పోలిక వద్దు: అమీర్

బాహుబలి-2 సక్సెస్ పై ఎట్టకేలకు అమీర్ కూడా స్పందించాడు. సచిన్ బయోపిక్ ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమా ప్రిమియర్ షో సందర్భంగా అమీర్.. ‘బాహుబలి-2’ గురించి మాట్లాడాడు. ఆ సినిమాను.. తాను హీరోగా నటించిన ‘దంగల్’ను పోల్చడం సరికాదన్న అమీర్ ఖాన్.. బాహుబలి-2 సాధించిన విజయాన్ని చూసి తాను గర్విస్తున్నట్లుగా చెప్పడం విశేషం. ‘‘దంగల్ సినిమాకు చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతుండటంపై నాకు చాలా ఆనందంగా ఉంది.

ఐతే ఏ రెండు సినిమాల్ని పోల్చి చూడటం సరి కాదు. బాహుబలి-2 కూడా గొప్ప సక్సెస్ అయింది. ఆ సినిమాను నేను ఇంకా చూడలేదు. కానీ దాని గురించి నా సన్నిహితుల నుంచి చాలా మంచి విషయాలు విన్నాను. రాజమౌళితో పాటు మొత్తం ఆ చిత్ర బృందాన్ని అభినందిస్తున్నా. దంగల్.. బాహుబలి-2 దేని స్థాయిలో అది గొప్పవి. అన్నిటికీ మించి రెండు భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించడం.. ఆదరణ పొందుతుండటం మంచి విషయం. నేను నా సినిమాతో పాటు ‘బాహుబలి’ని చూసి కూడా గర్విస్తున్నా’’ అని అమీర్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali 2  Dangal  China Collections  Highest Indian Grosser  

Other Articles