krish manikarnika lands into controversy మరో వివాదంలో కంగనా.. లీగల్ నోటీసులు..

Krish manikarnika lands into controversy

krish manikarnika lands into controversy, kangana ranaut historical movie, ketan mehta, ketan mehta ambitious film project, krish, manikarnika, kangana ranaut, the queen of jhansi, ketan mehta, tollywood, bollywood

Filmmaker Ketan Mehta has sent her a legal notice, accusing her of "hijacking" Rani of Jhansi - The Warrior Queen, his ambitious film project.

క్రిష్, కంగనా మోసం చేశారా..?

Posted: 05/19/2017 02:46 PM IST
Krish manikarnika lands into controversy

గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం తరువాత, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చారిత్రక చిత్రం మణికర్ణిక వివాదంలో చిక్కుకుంది. మణికర్ణిక పాత్ర కోసం అయన ఎంపిక చేసుకున్న నటి కంగనా రనౌతే ఈ వివాదానికి కారణం కావడం గమనార్హం. ఇటీవల కాలంలో అమెను వివాదాలు చుట్టుముట్టడం సర్వసాధరణంగా మారింపోయింది. హన్సల్ మెహతా తెరకెక్కించిన పిమ్రాన్ చిత్రంలో స్ర్కిప్టు రైటింగ్ విషయంలో అమె వివాదంలో చిక్కుకుని.. ఇంకా బయట కూడా పడకుండానే అమెను మరో వివాదం వెంటాడింది. క్రిష్ శ్రీకారం చుట్టిన. 'ఝాన్సీ లక్ష్మీబాయి' జీవిత చరిత్రను తెరకెక్కించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేసుకున్న నేపథ్యంలోనే ఈ వివాదం చోటుచేసుకుంది.

తన కలల ప్రాజెక్టు అయిన 'రాణి ఆఫ్ ఝాన్సీ' కథను గురించి కంగనాతో 2015లోనే మాట్లాడాననీ, అప్పుడే ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకారాన్ని తెలిపిందని దర్శకుడు కేతన్ మెహతా అన్నారు. అయితే తాజాగా అమె ఆ చిత్రంలో నటిస్తుందని, కాగా దర్శకుడితో పాటు అందరినీ మార్చేసిందని తెలుసుకుని.. తాము షాక్ కు గురయ్యామని మెహతా చెప్పారు. తాము సుదీర్ఘకాలం పరిశోధనలు చేసి అనేక విషయాలను సేకరించామని, ఇందుకోసం తమకు సమయం కూడా పట్టిందని, ఈ లోపు కంగనా రనౌత్ వేరే దర్శకుడితో అదే చారిత్రక నేపథ్యమున్న చిత్రంలో నటించడం పట్లు తాము అమెకు లీగల్ నోటీసులు పంపించామని చెప్పారు.

తమ చిత్రంలో నటించేందుకు అంగీకరించడంతో అమెతో చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను చర్చించామని.. అయితే తాము చెప్పిన విషయాలను కూడా అమె ఆ చిత్రంలో ఇమడ్చే అవకాశాలు వున్నాయని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక రకంగా ఇది తమ చిత్రాన్ని హైజాక్ చేయడమేనని నిర్మాత మెహతా అరోపించారు. ఇక కంగనాతో తాడో పెడో తేల్చుకోవాల్సిన అవసరం మా న్యాయవాది చూసుకుంటారని మిర్చి మసాలా, మాయా మేమ్ సాబ్, మంగల్ పాండే చిత్రాల నిర్మాత చెప్పారు. ఈ వివాదం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krish  manikarnika  kangana ranaut  the queen of jhansi  ketan mehta  tollywood  bollywood  

Other Articles