Baahubali 2 Creates History at box office, ఇండియన్ మూవీలో సరికొత్త రికార్డ్.. బాహుబలి థ్యాంక్స్

Baahubali 2 creates history becomes first indian movie ever to collect rs 1 000 crore

Rana Daggubatti, Prabhas, Baahubali 2 The Conclusion, baahubali, Anushka Shetty, ss rajamouli, baahubali 2, box office, collections, facebook, prabhas fans,

Baahubali 2 has made over Rs. 800 crore in India and more than 200 crore in the international markets, reported trade analyst Ramesh Bala

ఇండియన్ మూవీలో సరికొత్త రికార్డ్.. బాహుబలి థ్యాంక్స్

Posted: 05/07/2017 10:38 AM IST
Baahubali 2 creates history becomes first indian movie ever to collect rs 1 000 crore

ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో నూతన అద్యాయాన్ని లిఖించింది. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కాసుల పంట పండిస్తున్న ఈ చిత్రం నిర్మాతల పాలిట కల్పతరువుగా డిస్ట్రిబ్యూటర్ల పాలిట అక్షయపాత్రగా మారిందనడంలో సందేహమే లేదు. విడుదలైన అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని రికార్డ్ లను బద్దలు కొట్టి ఇండియాస్ బిగెస్ట్ బాక్ల్ బస్టర్ గా నిలిచిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది. ఇవాళ ఉదయానికి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమాగా నిలిచింది.

ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది బాహుబలి. శని, ఆదివారాల్లో కలెక్షన్లో ఊపందుకోవటంతో అనుకున్న సమయం కన్నా ముందే బాహుబలి 2 ఈ రికార్డ్ ను అందుకుంది. అంతేకాదు నార్త్ అమెరికా వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ బాహుబలి రికార్డ్ సృష్టించింది. ట్రెడ్ ఎనలిస్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాహుబలి చిత్ర హీరో ప్రభాస్ బావ్వోద్వేగానికి గురయ్యారు. ట్రేడ్ ఎనటిస్టుల అంచనాలను కూడా తారుమారు చేస్తూ ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూళ్లును రాబట్టడంతో హీరో ప్రభాస్ చిత్రానికి భారీ విజయాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రయత్నం తాను చేశానని… అందరి ఆదరణ చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నానన్నాడు. తనపై నమ్మకంతో జీవితంలో ఒక్కసారి లభించే ఇలాంటి అవకాశం ఇచ్చి, ఈ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన ఎస్‌.ఎస్‌ రాజమౌళికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని అన్నాడు ప్రభాస్. ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాలను తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ss rajamouli  baahubali 2  box office  collections  facebook  prabhas fans  tollywood  

Other Articles