Rajashekar's PSV Garuda Vega ready to release

Rajashekar garuda vega all set to release

Rajashekar New Movie, Rajashekar PSV Garuda Vega, PSV Garuda Vega Release Date, PSV Garuda Vega Sunny Leone, PSV Garuda Vega Rajashekar Item Song, PSV Garuda Vega Release Date, PSV Garuda Vega Movie, PSV Garuda Vega 2017, PSV Garuda Vega New Photos, Rajasekhar Garuda Vega

Tollywood Senior Hero Rajashekar's PSV Garuda Vega not shelved. Confirms for Summer Release.

రాజశేఖర్ గరుడ వేగ ఆగిపోలేదు

Posted: 04/29/2017 04:01 PM IST
Rajashekar garuda vega all set to release

కెరీర్ తొలినాళ్లలోనే యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కు రెండు దశాబ్దాల కెరీర్ తర్వాత పరిస్థితి మరో రకంగా తయారయ్యింది. స్టార్ హీరోల హవా, పెద్ద దర్శకులెవరూ ఆయన వైపు చూడకపోవటం, చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ రావటంతో క్రమంగా కెరీర్ మసకబారిపోతూ వస్తోంది. ఇక ఇప్పుడు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్న యంగ్ స్టర్లతో ఆయన అడ్రస్ లేకుండా పోయాడనే అనుకోవచ్చు.

ఇలాంటి దశలో చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాలతో ఫేమ్ అయిన ప్రవీణ్ సత్తార్ తో ఓ క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించాడు. గరుడ వేగ అంటూ మళ్లీ ఓ కాప్ స్టోరీతోనే రెడీ అయ్యాడు. షూటింగ్ ప్రారంభించుకున్న ఆ సినిమా ఆ మధ్య ఫస్ట్ లుక్ రాగా, మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే కొంత కాలంగా ఈ సినిమా ఆగిపోయిందంటూ వదంతులు వినిపించాయి. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తో నిర్మాత మధ్యలో డ్రాప్ అయ్యాడని, రాజశేఖర్ ఈ ప్రాజెక్టును టేకప్ చేశాడని చెప్పుకున్నాం.

కానీ, తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ సినిమా షెడ్డూ కెళ్లిపోయినట్లేనని కొందరు పుకార్లు లేపారు. దీంతో రంగంలోకి దిగిన రాజశేఖర్ సినిమా ప్రోగ్రెస్ ను చెబుతూ మూవీ స్టిల్స్ ను రిలీజ్ చేశాడు. అది కూడా ఏకంగా సన్నీ లియోన్ తో ఐటెం సాంగ్ కు సంబంధించిన పోస్టర్లను వదిలాడు. బాలీవుడ్ లో రామ్ లీలా లో రామ్ చాహే.. సాంగ్ కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ దీనికి స్టెప్పులు సమకూర్చటం విశేషం. మొత్తానికి సినిమా ఆగిపోయిందన్న వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందంటూ హింట్ కూడా ఇచ్చేశాడు రాజశేఖర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajashekar  PSV Garuda Vega  Release Date  

Other Articles