వీడియో: బాహుబలి వర్సెస్ భల్లాలదేవ ఫన్నీ పోటీ.. ఎవరు గెలిచారంటే... | Baahubali versus Bhallala Deva Hand Wrestling.

Prabhas active in baahubali 2 bollywood promotions

Baahubali 2. Baahubali 2 Telugu Promotions, Baahubali 2 Prabhas, Prabhas Promotions, Prabhas Shy End, Prabhas Rana Hand Wrestling, Baahubali and Bhallala Deva Hand Wrestling, Baahubali 2 Bollywood Promotions, Baahubali 2 Promotions, Prabhas Rana Funny Video

Prabhas And Rana Busy with Baahubali The Conclusion Bollywood Promotions.

బాహుబలి-2 ప్రమోషన్లు.. బాలీవుడ్ లోనేనా?

Posted: 04/15/2017 11:29 AM IST
Prabhas active in baahubali 2 bollywood promotions

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లో బాహుబలి చాలా చాలా మార్పులే తీసుకు వచ్చింది. స్టేజీ ఫియర్, సిగ్గు లాంటి కారణాలతో తక్కువగా మాట్లాడే ఈ హ్యాండ్స్ హంక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించేసిన ఈ నటుడు ప్రమోషన్ల విషయంలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

పార్ట్ 1 రిలీజ్ సమయంలో దగ్గరుండి రాజమౌళి బాలీవుడ్ లో ఈవెంట్లకు హాజరు చేయించగా, ఇప్పుడు ఎవరి సహకారం లేకుండానే ముంబైలో చక్కర్లు కొడుతున్నాడు. నిన్న గాక మొన్న ఐమాక్స్ పోస్టర్ లాంఛ్ టైంలో ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన సమయంలో ఎగబడిపోయిన మీడియాకు చాలా కూల్ గా నవ్వుతూ ఫోటోలు ఇచ్చిన ప్రభాస్ తర్వాత ప్రమోషన్ లలో కూడా అంతే యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.

మాములుగా బాలీవుడ్ లో అవుట్ డోర్ ప్రమోషన్లు ఎక్కువ. సినిమాలకు ముందు జనాల మధ్యలోకి వాళ్లే వెళ్లి సందడి చేసే కల్చర్ ఉంది. ఇదిగో సరిగ్గా ప్రభాస్, రానాలు కూడా దాన్నే ఫాలో అవుతూ చక్కర్లు కొట్టేస్తున్నారు. రీసెంట్ గా ఛండీగఢ్ లో అక్కడి అధికార పండగ వైశాఖికి హాజరైన ఈ ఇద్దరు అక్కడి ప్రజలతో సరదాగా గడిపారు. అందులో భాగంగా ఇదిలో ఇలా హ్యాండ్ రెజ్లింగ్ తో హుషారెత్తించారు.

 

అయితే ఇందులో ఎవరు గెలిచారన్నది మాత్రం అడక్కండి. ఎందుకంటే ఆ సస్పెన్స్ ను కట్టప్ప సీక్రెట్ లాగా అలాగే వదిలేసింది చిత్ర యూనిట్. అంత బాగానే ఉన్నా ఇలాంటివి తెలుగులోనూ చేస్తే ఎలా ఉంటుందంటారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Rana  Baahubali 2  Bollywood Promotions  

Other Articles