బాహుబలి-2 కోసం మరీ అంత ఆరాటమా? | Will Watch Baahubali 2 No Matter What.

People eagerly waiting for baahubali 2

Baahubali 2, Baahubali 2 Fever, Baahubali 2 Mania, Baahubali 2 Release, Baahubali 2 Verdict Poll, Baahubali 2 Irrespective Talk, Baahubali 2 Hit or Flop, irrespective of talk and Reviews, Why Kattappa killed Baahubali

Baahubali 2 No Matter What people eagerly waiting for watch it irrespective of talk and Reviews.

బాహుబలి 2 కోసం ఆరాటం ఎలా ఉందంటే...

Posted: 04/13/2017 05:09 PM IST
People eagerly waiting for baahubali 2

దేశం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒకే ఒక్క సినిమా బాహుబలి ది కంక్లూజన్. బాలీవుడ్ సహా అన్ని భాషల ఇండస్ట్రీలు కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయి. సినిమాలో చూడబోయే కంటెంట్, ఎమోషనల్, వార్ సీన్ల కంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న మిస్టరీ కోసమే ఆ ఆత్రుత ఎక్కువగా నెలకొంది.

బడ్జెట్ కు ట్రిపుల్ రేట్లుగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్, భారీ స్థాయిలో స్క్రీన్లలో ప్రదర్శన వెరసి ఏప్రిల్ 28న ఇండియన్ సినిమా బుక్ లో కలెక్షన్ల సునామీతో కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క నెగటివ్ టాక్, రివ్యూల భయం కూడా ఉందనుకోండి. అయితే అవేం పట్టనట్లు ప్రేక్షకుడు థియేటర్ క్యూ కట్టేందుకు సిద్ధమైపోతున్నాడు.

ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన పోల్ లో 75 శాతం ప్రేక్షకులు టాక్ తో సంబంధం లేకుండా కంక్లూజన్ ను చూసేయాలని డిసైడ్ అయిపోగా, మరో 25 శాతం మాత్రం థియేటర్ల నుంచి వచ్చే మౌత్ టాక్ ను బట్టే వెళ్లాలని చెబుతున్నారు. ఇక ఆ 75 శాతంలో కూడా 53 శాతం ఫస్ట్ డే నే చూసేయాలని తహతహలాడిపోతున్నారు. జస్ట్ శాంపిల్ కోసం నిర్వహించిన ఓటింగ్ రిజల్ట్ ఇలా ఉంటే.. రియాలిటీగా అది ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Release Fever  

Other Articles