ప్రభాస్ మెరిసేది మరీ అంత తక్కువ టైంలోనా? | Prabhas Sujith teaser time locked.

Prabhas new movie teaser date fix

Prabhas, Prabhas New Movie, Prabhas Sujith Movie, Prabhas 19th Movie, Prabhas New Movie Teaser, Prabhas 2017, Prabhas 2018 Movies, Prabhas Teaser, Prabhas Stylish Teaser, Prabhas Teaser Baahubali-2, Prabhas April 28 Teaser

Prabhas new movie teaser date fixed. Under Sujith direction this stylish movie teaser released with baahubali 2 screening. 90 seconds teaser Prabhas appears only 30 seconds.

ప్రభాస్ కొత్త సినిమా టీజర్ డేట్ ఫిక్స్?

Posted: 04/05/2017 04:59 PM IST
Prabhas new movie teaser date fix

కేవలం రాజమౌళి మూలంగానే బాహుబలి ద్వారానే ఈ క్రేజ్ వచ్చిందని, లేకుంటే ప్రభాస్ కు అంత సీన్ లేదంటూ కొంత మంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పని గట్టుకుని మరీ ట్రోల్ చేయటం చూశాం. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి కూడా దేశం మొత్తం చర్చించుకోవటం చూస్తుంటే ఆ వాదన సరైంది కాదన్నది తేలిపోయింది. ఇక మిగిలింది చిత్ర రెగ్యులర్ షూటింగ్ లో డార్లింగ్ ఎప్పుడు జాయిన్ అవుతాడో అని ఎదురుచూడటమే.

ఇదిలా ఉంటే కొంత కాలంగా ఈ చిత్ర టీజర్ ను బాహుబలి ది కంక్లూజన్ తో ప్రదర్శిస్తారనే చెప్పుకుంటూ వస్తున్నాం. దాదాపు 4 ఏళ్ల పాటు స్టైలిష్ ప్రభాస్ దూరం కావటంతో మళ్లీ ఎలా ఉంటాడోనని ఆసక్తి కూడా క్రియేట్ అవుతోంది. అందుకే ఆ అంచనాలను అందుకునే విధంగా నిమిషంన్నర సెకన్ల టీజర్ రూపకల్పన చేసే పనిలో సుజిత్ బిజీగా ఉన్నాడంట. కానీ, ఇందులో 40 సెకన్లు కేవలం ఎఫెక్ట్సే చూపించబోతున్నారంట. ఆ లెక్కన ప్రభాస్ కనిపించేది కేవలం 50 సెకన్లు మాత్రమే.

ప్రస్తుతం ఓ సీక్రెట్ లోకేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న టీజర్ లో జస్ట్ ప్రభాస్ మాత్రమే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్, మరికొందరు తారాగణం ను తీసుకోబోతున్నారనే చెప్పుకుంటున్నారు. మొత్తానికి బాహుబలి తోనే కొత్త సినిమా టీజర్ రాబోతుందన్న వార్త కన్ఫర్మ్ మాత్రం అయ్యింది. ఆ లెక్కన బాహుబలి-2, కొత్త సినిమా టీజర్ తో డబుల్ ట్రీట్ అందించబోతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Sujith Movie  Teaser Date  

Other Articles