కేరళను కాదని, కోనసీమ లోనే ఎందుకు? | Ram Charan Sukumar in Kona Seema Special Sets.

Ram charan sukumar movie regular shooting starts

Ram Charan Sukumar, Ram Charan New Movie, Ram Charan Village Guy, Ram Charan Sukumar Regular Shooting, Ram Charan Konaseema, Ram Charan Samantha

Ram Charan Sukumar Movie Regular Shooting starts from April 1st. Cherry already landed in Rajamaundry.

సుకుమార్-చెర్రీ మొదలుపెట్టారు

Posted: 04/01/2017 04:25 PM IST
Ram charan sukumar movie regular shooting starts

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాంచరణ్ కొత్త మూవీ షూటింగ్ ప్రారంభమైపోయింది. అఫీషియల్ గా రెండు నెలల క్రితమే ముహుర్తం లాంఛ్ అయిన సుకుమార్ సినిమా ఈ రోజు నుంచే పట్టాలెక్కింది. ధృవలో పోలీసాఫీసర్ గా మెప్పించిన చెర్రీ ఇప్పుడు పక్కా విలేజ్ బాయ్ గా నటించబోతున్నాడు.

పిరీయాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, లీడ్ పెయిర్ క్యారెక్టర్ లు రెండూ డిఫరెంట్ గా ఉంటాయని చెర్రీయే స్వయంగా చెబుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని శివగిరి-సిరివాక గ్రామాల మధ్య వేసిన ఒక ప్రత్యేకమైన గూడెం సెట్ లో ఈరోజు నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రత్యేక ట్రూజెట్ విమానంలో శనివారం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న చరణ్ అక్కడ నుండి కారులో లొకేషన్ కు బయలుదేరాడు.

విమానంలో అక్క సుస్మితతో పాటు దిగిన ఫోటోలు నెట్ లో దర్శనమిస్తున్నాయి. నిజానికి ఈ షూటింగ్ కేరళలో చేద్దామనుకున్నారు. కానీ, లోకేషన్లలో కొత్త దనం కొరుకునే సుకుమార్ చివరికి కోనసీమలో స్పెషల్ గూడెం సెట్స్ వేసి కానిచ్చేస్తున్నాడు. మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైభవ్ ఓ కీ రోల్ చేస్తుండగా, దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Sukumar  Regular Shooting  

Other Articles