తండ్రి తిట్టినందుకు కాదు.. అసలు నిజంగానే సూడైడ్ చేసుకుందా? | Model Kushboo Bhatt really commit Suicide.

New twist in model kushboo bhatt suicide

Model Kushboo Bhatt, Ahmedabad Model Suicide, Kushboo Bhatt Relation, Kushboo Bhatt Death, Indian Model Suicide, Anchor cum Model Death

Ahmedabad model commits suicide. Broken marriage broke model Kushboo Bhatt's heart.

మోడల్ ఖుష్బూ సూసైడ్.. మరో కొత్త కోణం

Posted: 03/22/2017 09:04 AM IST
New twist in model kushboo bhatt suicide

అహ్మదాబాద్ మోడల్ ఖుష్భూ భట్(27) ఆత్మహత్యలో మరో కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టీవీ యాంకర్ గా పాపులర్ అయిన ఆమె ఆదివారం మధ్యాహ్నం జోధ్ పూర్ సుకేత్ టవర్ లోని తన ఫ్లాట్ లో దుపట్టాతో ఉరేసుకున్న విషయం తెలిసిందే. తండ్రి మందలించటంతో ఆమె సూసైడ్ చేసుకుందని భావించిన పోలీసులకు ఆ తర్వాత మరోక విషయం తెలియటంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

భోజనం పెట్టే సమయంలో.. తాను డయాబెటిక్ అని.. ఎక్కువ అన్నం ఎందుకు పెడుతున్నావంటూ తండ్రి మినేశ్ భట్ మందలించటంతో ఆమె బాధపడి ఆత్మహత్య చేసుకుందని ఉండొచ్చని అంతా అనకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయం చెప్పటంతో పోలీసులు రిపోర్ట్ లో అదే నమోదు చేసుకున్నారు. అయితే ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ లభించకపోవటం, ఆమె పర్సనల్ విషయాలు చెప్పేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించటంతో అనుమానం వచ్చిన పోలీసులు మరో రకంగా దర్యాప్తు చేశారు.

అయితే ఏనిమిదేళ్ల క్రితమే పటేల్ వర్గానికి చెందిన ఓ యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న ఖుష్బూ ఆపై అతని నుంచి విడిపోయింది. తండ్రికి కూడా అతనితో వివాహం చేసుకోవటం ఇష్టం లేకపోవటంతో  బ్రేకప్ చెప్పిన ఆమె ఇంటికి వచ్చేసింది. వర్థమాన మోడల్ సూసైడ్ కు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారటంతో పోలీసులు దీని వెనుక డిప్రెషనే కారణమా? లేక వేరేయితర వ్యవహారాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmedabad Model  Kushboo Bhatt  Suicide  

Other Articles