ఫిల్మ్ ఫేర్ ఎంత పని చేసింది? నటుడి అక్రమ సంబంధంపై ఆర్టికల్ | Nawazuddin Siddiqui is suing a magazine website for defamation.

Nawazuddin siddiqui sends legal notice to filmfare

Nawazuddin Siddiqui, Nawazuddin Siddiqui Wife, Nawazuddin Siddiqui Film Fare, Film Fare Nawazuddin Siddiqui, Nawazuddin Siddiqui Defamation Sue, Defamatory Article Nawazuddin Siddiqui, Nawazuddin Siddiqui Wife, Nawazuddin Siddiqui Illegal relationship, Nawazuddin Siddiqui Fake Article, Nawazuddin Siddiqui Legal notices

Nawazuddin Siddiqui sues magazine over a defamatory article. Film Fare published that Nawazuddin and wife Anjali have apparently called it quits.

ఫిల్మ్ ఫేర్ కు నవాజుద్దీన్ లీగల్ నోటీసులు

Posted: 03/21/2017 12:13 PM IST
Nawazuddin siddiqui sends legal notice to filmfare

వార్తల పేరిట ఏదోస్తే అది రాసిపడేస్తూ సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలను రోడ్డుకీడుస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విషయంలో కూడా ఓ టాప్ మాగ్జైన్ ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు వారికి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఇంతకీ వాళ్లు చేసిన తప్పేంటో తెలుసా? ఆయన వైవాహిక జీవితం గురించి ఓ తప్పుడు వార్త ప్రకటించటం.

ఈ మధ్యే తన 7వ మ్యారేజీ యానివర్సరీ జరుపుకున్నాడు ఈ భజిరంగీ భాయ్ జాన్ స్టార్. భార్య అంజలితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేయగా, సోషల్ మీడియాలో అంతా విషెస్ చెప్పారు. అయితే ప్రముఖ ఫిల్మ్ ఫేర్ మాగ్జైన్ మాత్రం ఈ వ్యవహారాన్ని ఇంకోలా చేసి పడేసింది. నవాజుద్దీన్ కాపురంలో చిచ్చు పెట్టేలా మార్చి 8న తన సంచికలో ఓ ఆర్టికల్ ను ప్రచురించింది.

ఓ అపరిచిత మహిళతో ఉన్న ఫోటోను పెట్టి ఆమెతో ఆ నటుడికి సంబంధం ఉందని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, అది నచ్చక అతని భార్య పిల్లలతోసహా ఇల్లు వదిలి వెళ్లిపోయిందని ఇలా కథనం రాసింది. ఈ తప్పుడు స్టోరీపై మండిపడ్డ నవాజుద్దీన్ ఫిల్మ్ ఫేర్ మాగ్జైన్ వెబ్ విభాగపు ఎడిటర్ కు లీగల్ నోటీసులు పంపటమే కాదు, వారం లోగా క్షమాపణ చెబుతూ వివరణ ఇవ్వాలంటూ అందులో తెలిపాడు. గత పది రోజులుగా తాను తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నానని, అందుకు కారణం అయిన వాళ్లను విడిచిపెట్టేది లేదంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawazuddin Siddiqui  Wife Anjali  Film Fare Magazine  Legal Notices  

Other Articles