శింబు, ధనుష్.. లేడీ సింగర్.. సెక్స్ స్కాండల్ ట్వీట్లు.. | Controversial Tweets on Dhanush and Simbu.

Female singer s controversial tweets on dhanush

Singer Suchitra, Singer Suchitra Tweets, Dhanush and Simbu, Dhanush Suchitra, Suchitra Kartik, Dhanush and Simbu Suchitra, Singer Suchitra Sex Scandal, Singer Suchitra Controversy tweets, Simbu Suchitra

Singer Suchitra has got something to tell and she has made it obvious with her mysterious tweets pointing fingers at big stars like Dhanush and Shimbu alongside Sadhguru Jaggi Vasudev. She seems to be having complaints on actor Shimbu as well. In her tweets Suchitra warned her followers about a sex scandal going to erupt in an ashram near Coimbatore.Everything looks messy as her tweets are too mysterious to understand.

ధనుష్, శింబులపై ఫిమేల్ సింగర్ ట్వీట్లు

Posted: 02/24/2017 01:04 PM IST
Female singer s controversial tweets on dhanush

కోలీవుడ్ సింగర్ సుచిత్ర చేసిన ట్వీట్లు సౌత్ లో కలకలం రేపుతున్నాయి. తమిళ స్టార్ హీరోలు శింబు, ధనుష్ లపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. వీరితోపాటు సద్గురు జగ్గీ వాస్ దేవ్ పై కూడా ఆమె ట్వీట్లు చేయటం కొసమెరుపు. శింబు, ధనుష్ లు తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారంటూ సుచిత్ర ట్వీట్ చేశారు.

అయితే, ఇది నిజం కాదని, సుచిత్ర ట్విట్టర్ హ్యాక్ చేసి, ఎవరో ఈ పోస్ట్ చేశారనే ఆమె భర్త, పాపులర్ సింగర్ అయిన కార్తీక్ తెలిపాడు. అంతలోనే, వెంటనే తన సెల్ఫీ ఫొటోను సుచిత్ర పోస్ట్ చేసి... తాను ట్విట్లర్లోకి మళ్లీ వచ్చానని చెప్పింది. ధనుష్ ప్రవర్తన గురించి అందరికీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఇది ముమ్మాటికీ నిజమని చెప్పింది. 'శింబు.. నువ్వు కూడా ఈ లిస్ట్ లో ఉన్నావు' అని తెలిపింది. ధనుష్ టీమ్ రఫ్ హ్యాండ్లింగ్ వల్ల గాయపడ్డ తన చేతి ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది.

 

ఇదిలా ఉంటే కొయంబత్తూర్ లోని ఓ ఆశ్రమం లో పెద్ద ఎత్తున్న సెక్స్ స్కాండల్ జరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని ఆమె చేసిన మరో ట్వీట్ సంచలనంగా మారింది. ఓవైపు ఆమె భర్త సుచిత్ర మానసిక స్థితి బాగోలేదని చెబుతుంటే.. తాను బాగానే ఉన్నానంటూ డాక్టర్ రిపోర్ట్ లు చూపుతుందీ సింగర్ కమ్ నటి. ఓ వైపు హీరోయిన్లు భావన, వరలక్ష్మీ శరత్ కుమార్ ల ఉదంతాలు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంటే... తాజాగా సుచిత్ర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీని వెనుక ఏదో మిస్టరీ ఉందనే పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యవహారంలో సినీ పెద్దలు జోక్యం చేసుకుంటారా? చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Suchitra  Controversy Tweets  Dhanush  Simbu  

Other Articles