నోట్ల రద్దు ఎఫెక్ట్ దంగల్ పై లేదా? | Dangal box-office collection Day One.

Dangal first day report

Dangal, Dangal First day collections, Best Opener after Sultan, 2016 Danagal, Dangal collections, Dangal First day, Dangal Movie

Dangal First day Box Office Collection: Best Opener after Sultan!

అమీర్ దంగల్ ఫస్ట్ డే రిపోర్ట్

Posted: 12/24/2016 01:42 PM IST
Dangal first day report

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ దంగల్ తో దుమ్మురేగొట్టాడు. తన విలక్షణతను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అల్రెడీ రెజ్లర్ కాన్సెప్ట్ తో సుల్తాన్ వచ్చింది. అయినా తన కమిట్ మెంట్ ను కంటిన్యూ చేసిన అమీర్ దంగల్ ను రూపొందించాడు. తాను చేయలేకపోయిన పనిని కొడుకుళ్లు లేకపోవటంతో కూతుళ్లనే ఆయుధాలుగా చేసుకుని తన లక్ష్యం ఎలా నేరవేర్చుకున్నాడు అన్న కథనంతో తెరకెక్కిందే దంగల్.

హర్యానా రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. రెజ్లర్గా ఎంతో సాధించిన ఫోగట్ తన వారసులుగా కూతుళ్లనే బరిలో దించటం అందుకు వారిని ఎలా సిద్ధం చేశాడన్నదే దంగల్ కథ. తాను సాధించలేని బంగారు పతకాన్ని కూతుళ్ల ద్వారా భారత్కు అందించాలని నిశ్చయించుకుంటాడు. తానే శిక్షకుడిగా మారి కూతుళ్లను దేశకీర్తి పతాకాన్ని ఎగురవేసే రెజ్లర్లుగా తయారు చేస్తాడు అన్నదాన్ని లీనమై పోయి చూపించాడు అమీర్. సినిమా తొలి సీన్ నుంచే ప్రేక్షకున్ని కథలో లీనం చేసిన దర్శకుడు, పర్ఫెక్ట్ స్క్రీన్ప్లేతో ఆకట్టుకున్నాడు.

ప్రీతమ్ అందించిన సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో భావోద్వేగాలను తన సంగీతంతో మరింత రక్తికట్టించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నింటికీ మించి ఆమిర్ నిర్మాణ విలువలు సినిమాను ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాగా ప్రేక్షకులముందుంచాయి. ఇంతకు ముందు బడా స్టార్లతో చిన్న సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు నితీష్ తివారి డైరక్షన్ లో ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసహనం వ్యాఖ్యలు మొదలు, నోట్ల రద్దు కూడా సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

దీంతో ఫస్ట్ డే కలెక్షన్లలో ఈ యేడాది రెండో స్థానంలో దంగల్ నిలిచింది.(ఇంచుమించు 30 కోట్లు-సల్మాన్ సుల్తాన్ 36 కోట్లతో మొదటి స్థానంలో). నిలిచింది. ఓవరాల్ గా టాప్ టెన్ బాలీవుడ్ ఫస్ట్ డే గ్రాసర్ లో 7వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో షారూఖ్ హ్యాపీ న్యూఇయర్ ఉండగా, రెండు మూడు ప్లేస్ లలో సల్మాన్ ప్రేమ్ రతన్ ధన్ పాయో, ధూమ్-3 లు ఉన్నాయి. తెలుగు, తమిళ్ లో 70 లక్షల దాకా వసూలు చేసినట్లు సమాచారం. మొత్తానికి తన శారీరక శ్రమకే కాదు.. ఎమోషనల్ నటనతో అమీర్ ఆకట్టుకోవటంతో ఈ అద్భుత చిత్రానికి ప్రేక్షకులు భాషా బేదాలను మరిచి బ్రహ్మరథం పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dangal Movie  First day Collections  

Other Articles